Telangana Budget Highlights 2023-24
తెలంగాణ లో రూ.2,90,396 కోట్లతో 2023-24 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు గా ఉంటే , మూలధన వ్యయం రూ.37,585 కోట్లు గా ఉంది.
తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,215 గా ఉన్నట్లు మంత్రి ప్రకటించారు.
తెలంగాణ బడ్జెట్ 2023-24 ముఖ్యాంశాలు
శాఖలు / పథకాల వారీగా కేటాయింపులు ఇలా
వ్యవసాయానికి కేటాయింపులు రూ.26,831 కోట్లు
నీటి పారుదల శాఖకు రూ.26,885 కోట్లు
విద్యుత్ కేటాయింపులు రూ.12,727కోట్లు
ఆసరా ఫించన్ల కోసం రూ.12వేల కోట్లు
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు
ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు
ఎస్టీ ప్రత్యేక నిధి కోసం రూ.15,233కోట్లు
బీసీ సంక్షేమం కోసం రూ.6,229 కోట్లు
మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131కోట్లు
హోం శాఖ కు రూ. 9,599 కోట్లు
పరిశ్రమల శాఖ కు రూ. 4,0,37 కోట్లు
పురపాలక శాఖ కు రూ. 11, 372 కోట్లు
రహదారుల నిర్వహణ, మరమ్మత్తులకు రూ. 2500 కోట్లు
వైద్య ఆరోగ్య రంగానికి రూ. 12,161 కోట్లు
పంచాయితీ రాజ్ శాఖ కు రూ. 31,426 కోట్లు
విద్యా శాఖ కు రూ. 19,093 కోట్లు
అటవీ శాఖ, తెలంగాణ కు హరిత హారం కు రూ. 1471 కోట్లు
ఇతర కీలక అంశాలు
కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల కోసం 3210 కోట్లు కేటాయించారు
జర్నలిస్టులు, న్యాయవాదుల సంక్షేమం కోసం చెరో 100 కోట్లు
Double bedroom ఇళ్లకు 12 వేల కోట్లు
రైతు బంధు కోసం 15 వేల కోట్లు
దళిత బంధు కోసం 17 వేల కోట్లు
ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
సొంత జాగా (ఇంటిస్థలం) ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి 3 లక్షల ఆర్థికసాయం . నియోజకవర్గానికి 2 వేలమందికి చొప్పున ఆర్థికసాయం.. సీఎం కోటాలో మరో 25వేల మందికిఅదనంగా సాయం చేయనుంది. మొత్తం 2.63 లక్షలమందికి రూ.7890 కోట్లు ఆర్థికసాయం ఇవ్వనున్నారు.
Leave a Reply