ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్, కొత్త పథకాలు

ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్, కొత్త పథకాలు

దివ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులపై వరాలు కురిపించారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్లస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు కింద ఇవ్వబడిన విధంగా మరికొన్ని కీలక ప్రకటనలు చేశారు.

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం

ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం తాజాగా దివ్యంగులను కూడా ఈ కేటగిరీలో చేర్చనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు మరింత ఊరట చేకూరనుంది.

కార్పొరేట్, ప్రైవేట్ రంగాల సహకరంతో ఉద్యోగావకాశాలు

కార్పొరేట్ కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ఇంటర్‌ప్రైజ్ విభాగాలతో కలిసి దివ్యాంగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగుల ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు, నైపుణ్యాల అభివృద్ధి శిక్షణలు అందించనున్నట్లు సీఎం తెలిపారు.

క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో దివ్యాంగులకు ప్రోత్సాహం

SAAP ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దివ్యాంగులకు ప్రత్యేక పథకాలు, ఆర్థిక సబ్సిడీ, ప్రత్యేక డిగ్రీ కాలేజీలు, వారు ఉన్నచోటే పెన్షన్ పంపిణీ వంటి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

‘దివ్యాంగ్ భవన్’ నిర్మాణం

రాజధాని అమరావతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ‘దివ్యాంగ్ భవన్’ నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇది దివ్యాంగుల కోసం శిక్షణ, సేవలు, ఉద్యోగ అవకాశాల సమన్వయం వంటి అన్ని కార్యక్రమాలకు కేంద్రంగా ఉండనుంది.

మంచి భవిష్యత్తుకు ప్రభుత్వ సంకల్పం

దివ్యాంగుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేస్తామని, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.


Also Read

You cannot copy content of this page