Aadhaar Bank Link Status 2025: బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయ్యిందా? UIDAI ద్వారా ఇలా చెక్ చేయండి

Aadhaar Bank Link Status 2025: బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అయ్యిందా? UIDAI ద్వారా ఇలా చెక్ చేయండి

Aadhaar Bank Link Status 2025: ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న అన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, పీఎం కిసాన్, పింఛన్, స్కాలర్‌షిప్‌లు వంటి సాయాలు కేవలం ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాల్లోకే జమ అవుతున్నాయి. Aadhaar–Bank Seeding యాక్టివ్‌గా లేకపోతే డబ్బులు ఖాతాలో పడకపోవచ్చు లేదా తిరిగి వెళ్లిపోవచ్చు.
అందువల్ల మీ Aadhaar ఏ బ్యాంక్‌తో లింక్ అయిందో, అది Active లో ఉందో లేదో UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.


Aadhaar Bank Link Status ఎందుకు చెక్ చేయాలి?

ప్రభుత్వ పథకాల్లో డబ్బులు పొందడానికి Aadhaar-linked bank account తప్పనిసరి. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, PM-Kisan వంటి పథకాల డబ్బులు కూడా Aadhaar-seeded ఖాతాల్లోకే జమ అవుతున్నాయి. ఆధార్ లింక్ లేకపోవడం వల్ల అనేక మంది లబ్ధిదారులకు DBT విఫలమైన సందర్భాలు కనిపించాయి.


UIDAIలో Aadhaar Bank Linking Status ఎలా చెక్ చేయాలి?

UIDAI అందిస్తున్న Bank Seeding Status ఫీచర్ ద్వారా మీరు ఆన్లైన్‌లోనే మీ Aadhaar ఏ బ్యాంక్‌తో లింక్ అయిందో, ఎప్పుడు లింక్ అయిందో మరియు అది Active లో ఉందో లేదో చూసుకోవచ్చు.

Step-by-Step Process: Aadhaar Bank Link Status Check

1. UIDAI బ్యాంక్ సీడింగ్ స్టేటస్ పేజ్ ఓపెన్ చేయాలి

https://myaadhaar.uidai.gov.in/bank-seeding-status లింక్‌ను ఓపెన్ చేయండి.

2. మీ Aadhaar Number నమోదు చేయండి

12 అంకెల ఆధార్ నంబర్ టైప్ చేయాలి.

3. OTP ద్వారా లాగిన్ అవ్వాలి

మీ Aadhaar‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది. దానిని నమోదు చేసి వెరిఫై చేయాలి.

4. Aadhaar Bank Link Status చూడండి

మీ స్క్రీన్‌పై ఈ వివరాలు కనిపిస్తాయి:

  • Aadhaar ఏ బ్యాంక్ ఖాతాతో లింక్ అయింది
  • Aadhaar Linking చేసిన తేదీ
  • Status: Active / Inactive

Active Status

మీ Aadhaar NPCI Mapper‌లో యాక్టివ్‌గా ఉంది. DBT డబ్బులు సజావుగా మీ ఖాతాలో పడతాయి.

Inactive Status

Aadhaar inactive‌లో ఉండడంతో DBT విఫలమవుతుంది. లబ్ధిదారుల డబ్బులు ఖాతాలో పడకపోవచ్చు.

Inactive కనిపిస్తే వెంటనే మీ బ్యాంకులో e-KYC పూర్తి చేయాలి.


Aadhaar Bank Linking లేకపోతే ఏమి చేయాలి?

మీ Aadhaar బ్యాంక్ ఖాతాతో లింక్ కాకపోతే ఈ రెండు మార్గాల్లో లింకింగ్ పూర్తి చేయవచ్చు.


1. ఆన్‌లైన్ / మొబైల్ బ్యాంకింగ్ ద్వారా

కొన్ని బ్యాంకులు ఆధార్ లింకింగ్ ఆన్‌లైన్ సౌకర్యం అందిస్తున్నాయి. ఉదాహరణ:

  • SBI
  • ICICI Bank
  • HDFC Bank
  • Union Bank
  • Canara Bank
  • Bank of Baroda

ప్రక్రియ:

  • Bank Net Banking లేదా Mobile App ఓపెన్ చేయండి
  • Services / My Profile లో Aadhaar Update లేదా Aadhaar Seeding ఆప్షన్ ఎంచుకోండి
  • ఆధార్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా వెరిఫై చేయండి

కొన్ని గంటల్లో NPCI Mapper‌లో Aadhaar అప్డేట్ అవుతుంది.


2. బ్యాంక్ బ్రాంచ్‌లో నేరుగా

ఆన్‌లైన్ సౌకర్యం లేకపోతే లేదా వివరాలు అప్‌డేట్ కాకపోతే బ్యాంక్‌కి వెళ్లి Aadhaar Seeding పూర్తి చేయవచ్చు.

అవసరమైన డాక్యుమెంట్లు:

  • Aadhaar Card
  • Bank Passbook
  • Mobile Number

బ్యాంక్ సిబ్బంది బయోమెట్రిక్ ఆథెంటికేషన్ చేసి Aadhaar–Bank Linking పూర్తిచేస్తారు. 24–48 గంటల్లో Active Statusలో కన్పిస్తుంది.


Inactive Status అంటే ఏమిటి?

Inactive Status అంటే NPCI Mapper‌లో మీ Aadhaar యాక్టివ్‌గా లేనట్టే. ఈ సందర్భాల్లో:

  • DBT డబ్బులు ఖాతాలో పడవు
  • డబ్బులు తిరిగి పంపబడతాయి
  • మీ ఖాతా Aadhaar-seeded listలో ఉండదు

ఈ స్టేటస్ కన్పిస్తే వెంటనే బ్యాంక్‌కి వెళ్లి e-KYC చేయించాలి.


Aadhaar Bank Link Status Frequently Asked Questions (FAQ)

1. ఒక Aadhaar కి ఎన్నన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ అవుతాయి?

ఎన్నో ఖాతాలకు లింక్ అవుతుంది. కానీ DBT కోసం NPCI ఒకే ప్రైమరీ ఖాతాను ఉపయోగిస్తుంది.

2. Active Status ఉంటే డబ్బులు పడతాయా?

అవును. Active గా ఉంటే DBT సజావుగా మీ ఖాతాలోకి జమ అవుతుంది.

3. Inactive Status వస్తే ఎంత టైంలో సరి అవుతుంది?

బ్యాంక్‌లో e-KYC చేసిన 24–48 గంటల్లో సరి అవుతుంది.

4. మొబైల్ నంబర్ లేకుండా స్టేటస్ చెక్ చేయగలమా?

కాదు. Aadhaar‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తప్పనిసరి.

5. స్టేటస్‌లో బ్యాంక్ పేరు కన్పించకపోతే?

మీ Aadhaar ఏ బ్యాంక్ ఖాతాతోనూ ప్రస్తుతం మ్యాప్ అయి ఉండకపోవచ్చు. లింకింగ్ పూర్తి చేయాలి.

Also Read

You cannot copy content of this page