అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ అమౌంట్ విడుదల | Annadata Sukhibhava – PM Kisan 21st Installment Released

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ అమౌంట్ విడుదల | Annadata Sukhibhava – PM Kisan 21st Installment Released

Annadata Sukhibhava – PM Kisan 21st Installment Released: వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. తన పర్యటనలో గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడే అవకాశం కలిగించారు. రైతుల సమస్యలు, సాగు వివరాలు, ఎరువుల లభ్యతపై ప్రత్యక్షంగా సమాచారం తీసుకున్నారు.

తర్వాత నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో నుండి అన్నదాతా సుఖీభవ – పీఎం కిసాన్ రెండో విడత నిధులను అధికారికంగా విడుదల చేశారు.

రాష్ట్ర రైతులకు భారీ ఊరట

  • మొత్తం 47 లక్షల మంది రైతులకు నిధులు జమ
  • మొత్తం విడుదలైన మొత్తం ₹3,200 కోట్లు
  • ప్రతి రైతుకు ₹7,000 చొప్పున బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ

పీఎం కిసాన్ ప్రయోజనాలైన కేంద్ర ప్రభుత్వ నిధులు, కోయంబత్తూరులో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాతా సుఖీభవ నిధులతో కలిపి, రైతులకు మొత్తం భారీ ఆర్థిక సహాయం అందింది.

అన్నదాత సుఖీభవ – ఈ విడతలో జమ అయ్యే మొత్తం

  • PM-Kisan అమౌంట్ : ₹2,000
  • అన్నదాత సుఖీభవ అమౌంట్ : ₹5,000
  • మొత్తం అమౌంట్: ₹7,000

ఎవరికీ వస్తుంది? (Eligibility)

  • AP రాష్ట్ర రైతులు
  • చిన్న & సన్నకారు రైతులు
  • భూ రికార్డులు సరైనవి
  • PM-Kisan లో నమోదు
  • Aadhaar-Bank Linking & e-KYC పూర్తి

PM-KISAN 21వ విడత విడుదల

దేశవ్యాప్తంగా PM-Kisan 21వ విడత విడుదలైంది. ప్రతి రైతుకు ₹2,000 జమ అవుతుంది.

PM-Kisan Payment Status ఇలా చెక్ చేయాలి

PM కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ 2025 మరియు PM కిసాన్ పెమెంట్ స్టేటస్ ను ఇలా చెక్ చేయండి

క్రింద ఉన్న స్టెప్స్ ను అనుసరించి ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్‌ తో సులభంగా మీ PM కిసాన్ స్టేటస్ ను చెక్ చేయండి

Step 1: దిగువన ఇవ్వబడిన అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి. అందులో know your status లింక్ పై క్లిక్ చేయండి లేదా కింద ఇవ్వబడిన Know your status డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేయండి.

Step 2: పైన ఇవ్వబడిన know your status లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. Registration number తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే కింద ఎలా తెలుసుకోవాలో స్టెప్స్ ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

Step 2.1: మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే “know your registration number”పై క్లిక్ చేయండి

Step 2.2 : మీరు మొబైల్ నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవచ్చు .. ఏదో ఒకటి ఎంచుకొని ‘Get Mobile OTP’ పైన క్లిక్ చేయండి.

మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.

Step 2.3: మీరు మీ మొబైల్ లేదా ఆధార్‌ని నమోదు చేసిన తర్వాత మీరు వివరాలను క్రింది విధంగా చూడవచ్చు, అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ క్రింది విధంగా చూపబడుతుంది.


Step 3: మీరు రిజిస్ట్రేషన్ నంబర్‌ ను పొందిన తర్వాత, దిగువన ఉన్న విధంగానే ఎంటర్ చేసి, ఆపై captcha కోడ్‌ ను నమోదు చేయండి.



Step 4: వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Get OTP” పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి.


Step 5: మీ PM-KISAN స్టేటస్ మరియు పేమెంట్ వివరాలు దిగువన స్క్రీన్‌ పై చూపించబడతాయి. మీరు డ్రాప్ డౌన్ నుండి మీ మునుపటి మరియు ప్రస్తుత installment ను సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా పేమెంట్ అయిందా లేదా స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.

ఇది FTO ప్రాసెస్ చేయబడిందని చూపిస్తే, PM నిధులను విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకు అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది. మీకు చెల్లింపు అయిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ మరియు ఖాతా వివరాలు చూపిస్తాయి.

గమనిక: pm కిసాన్ నిధులను పొందాలంటే EKYC తప్పనిసరి. పైన ఇవ్వబడిన ప్రాసెస్ అనుసరించి మీరు మీ ekyc స్టేటస్ ను కూడా చెక్ చేయవచ్చు. తదనుగుణంగా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని CSC కేంద్రాల ద్వారా kycని పూర్తి చేయవచ్చు. eky

అన్నదాత సుఖీభవ 2వ విడత అమౌంట్ విడుదల

కడప జిల్లా కమలాపురం నుంచి అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు

Annadata Sukhibhava Status చెక్ చేయండి

అన్నదాత సుఖీభవ స్టేటస్ కొరకు కింది లింక్ పై క్లిక్ చేయండి. కింది లింక్ లో ఆధార్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చు.

రైతులు తప్పనిసరిగా చెక్ చేయాల్సినవి

You cannot copy content of this page