కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2023 వివిధ వస్తువుల పై కీలక ప్రభావాన్ని చూపాయి.
డిజిటల్ సామగ్రి అయినటువంటి టీవీ, మొబైల్ ఫోన్ల పై కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది, మరోవైపు బంగారం , వెండి, సిగరెట్ల పై కస్టమ్స్ సుంఖాన్ని పెంచింది.
గోల్డ్, ప్లాటినం బార్స్ తో తయారు చేసే ఆభరణాల పై కేంద్రం కస్టమ్స్ సుంకం పెంచింది. తద్వారా బంగారం మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది.
గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్న బంగారం గత నెల స్థిరంగా కొనసాగింది. అయితే బడ్జెట్ ప్రసంగంలో కస్టమ్స్ సుంకం పెంచుతున్నట్లు ప్రకటన వెలువడుతునే బంగారం వెండి ధరలు ఆమాంతం పెరిగాయి.
పది గ్రాముల 24 క్యారట్ పై ఏకంగా రికార్డ్ స్థాయిలో 650 రూపాయలు వరకు పెరిగి, 58,470 వద్ద సేల్ అవుతుండగా, 22 క్యారట్ పైన 600 పెరిగి, 53600 వద్ద సేల్ అవుతుంది.
బంగారం మరింత ప్రియం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇప్పుడే బంగారం కొనుగోలు కు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది.
మరోవైపు వెండి కిలో 1500 పెరిగి 77300 కు చేరింది.
ఏది ఏమైనా రానున్న రోజుల్లో సామాన్యుడు బంగారం వెండి కొనాలంటేనే బెంబేలెత్తి పోయే పరిస్థితి కనిపిస్తుంది.
బడ్జెట్ ప్రభావంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి మొబైల్, టీవీ వంటి వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉండగా, బంగారం , వెండి, వజ్రాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Leave a Reply