PM VISHWAKARMA – PM విశ్వకర్మ.. తొలిసారిగా చేతి వృత్తుల వారికి కేంద్రం కొత్త పథకం..అర్హులు వీరే

PM VISHWAKARMA – PM విశ్వకర్మ.. తొలిసారిగా చేతి వృత్తుల వారికి కేంద్రం కొత్త పథకం..అర్హులు వీరే

దేశ వ్యాప్తంగా చేతి వృత్తులు, సంప్రదాయ కళలతో జీవనం సాగిస్తున్న విశ్వకర్మలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం “PM విశ్వకర్మ యోజన” అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

ఇది చదవండి: PM విశ్వకర్మ యోజన 2023 గురించి తెలుసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి

PM విశ్వకర్మ పథకం పూర్తి వివరాలు [About PM Vishwakarma ]

దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. చేతులతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారి ని విశ్వకర్మ అని పిలుస్తారు.

వీరి కోసం తొలిసారి సహాయ ప్యాకేజీని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ సహాయ ప్యాకేజీని PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనే పథకం రూపంలో అమలు చేస్తారు. ఈ కొత్త పథకం ద్వారా సంపద్రాయ వృత్తులపై ఆధారపడే విశ్వకర్మ వర్గాల వారిని MSME వాల్యూ చైన్‌తో అనుసంధానం చేస్తారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అయిదు సంవత్సరాల కాలం పాటు , అనగా 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.

Benefits: అర్హులైన వారికి విశ్వకర్మ సర్టిఫికెట్, గుర్తింపు కార్డు మరియు ఆర్థిక సహాయం

పిఎం విశ్వకర్మ పథకం లో భాగంగా, చేతివృత్తుల వారికి మరియు హస్తకళల నిపుణులకు కింది ప్రయోజనాలు ఉంటాయి.

✓పిఎమ్ విశ్వకర్మ సర్టిఫికెటు ను, గుర్తింపు కార్డు ను ఇస్తారు

✓ ఒక లక్ష రూపాయల వరకు (ఒకటో దఫా లో) మరియు 2 లక్షల రూపాయల వరకు (రెండో దఫా లో) రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీ తో ఇస్తారు.

✓ ఈ పథకం లో భాగం గా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్శన్స్ మరియు మార్కెటింగ్ సంబంధించి సహాయ సహకారాలను కూడా అందజేయడం జరుగుతుంది.

✓ పీఎం విశ్వకర్మ లో రెండు రకాల నైపుణ్య శిక్షణలో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. బేసిక్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మరియు అడ్వాన్స్డ్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉంటాయని తెలిపింది. లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

✓ అలాగే ఆధునిక యంత్రాలు, కొనుక్కోవడానికి
పరికరాలు రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు. మొదటి ఏడాది 5లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. గురు-శిష్య పరంపరను, కుటుంబ ఆధారిత సంప్రదాయ నైపుణ్యాలను బలోపేతం చేయడమే పథకం ఉద్దేశమని కేంద్రం తెలిపింది. తొలుత 18 రకాల సం
ప్రదాయ నైపుణ్యాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు.

ఏ కులాల వారికి ఈ పథకం వర్తిస్తుంది?

పిఎమ్ విశ్వకర్మ లో భాగం గా తొలి విడత లో 18 సాంప్రదాయిక చేతివృతులు చేసుకునే వారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. పూర్తి జాబితా ఇదే

(1) వడ్రంగులు;

(2) పడవల తయారీదారులు;

(3) ఆయుధ /కవచ తయారీదారులు;

(4) కమ్మరులు;

(5) సుత్తి, ఇంకా పరికరాల తయారీదారులు;

(6) తాళాల తయారీదారులు;

(7) బంగారం పని ని చేసే వారు;

(8) కుమ్మరులు;

(9) శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తి లో ఉండే వారు;

(10) చర్మకారులు /పాదరక్షల తయారీ దారులు;

(11) తాపీ పనివారు;

(12) గంపలు/చాపలు/చీపురులను తయారు చేసేవారు;

(13) కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు, (సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు);

(14) నాయి బ్రాహ్మణులు;

(15) మాలలు అల్లే వారు;

(16) రజకులు;

(17) దర్జీలు మరియు;

(18) చేపల ను పట్టేందుకు ఉపయోగించే వలల ను తయారు చేసేవారు

Click here to Share

30 responses to “PM VISHWAKARMA – PM విశ్వకర్మ.. తొలిసారిగా చేతి వృత్తుల వారికి కేంద్రం కొత్త పథకం..అర్హులు వీరే”

  1. Vaddi Suresh Avatar
    Vaddi Suresh

    Wood work బిజినెస్

  2. Vaddi Suresh Avatar
    Vaddi Suresh

    వడ్రంగి

  3. Suresh bannaravuri Avatar
    Suresh bannaravuri

    Naya bhrameines

  4. Siva Avatar
    Siva

    అయ్యా కులం వారికీ ఇస్తారా . లేకపోతే పని చేసే వారికి ఇస్తారా.. నాది oc కులం అయ్యా కానీ నేను చేసుకునేది చేతి పని అయ్యా

  5. Siva Avatar
    Siva

    అయ్యా కులం వారికీ ఇస్తారా . లేకపోతే పని చేసే వారికి ఇస్తారా.. నాది oc కులం అయ్యా కానీ నేను చేసుకునేది చేతి పని అయ్యా

  6. Bsubbaiah Avatar
    Bsubbaiah

    Corpantaru

  7. Chitikela sunil Avatar
    Chitikela sunil

    Great opportunity

  8. Dasari nageswara rao Avatar
    Dasari nageswara rao

    Super sir

  9. Ganesh Avatar
    Ganesh

    Tq modi gaaru 🙏
    Adoni Nayi brahmana seva sangam
    🙏🙏🙏🙏

  10. Apetla srinivas Avatar
    Apetla srinivas

    Super sir

  11. Bangaru babu. Kondamudi Avatar
    Bangaru babu. Kondamudi

    కేంద్రప్రభుత్వం దేశంలో ఉన్న విశ్వకర్మ ల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న పీఎం మోడీగార్కి దేశంలో ఉన్న విశ్వకర్మ లు అందరం ఋణపడి ఉంటాము.. జై బీజేపీ జై హో మోడీజీ. కొండముది బంగారు బాబు బీజేపీ ఆర్టిసన్ సెల్ స్టేట్ కన్వీనర్ 💐💐

  12. J Rajender Chary Avatar
    J Rajender Chary

    Vishwakarma Gold Work : Now a day there is not much work Gold Ornaments making people Gold Price is going on increase. So self investing and doing the ornaments it is not possible with middle class people. If our PM Modi ji is giving the change to improve ability and do the msme business. Thanks for Modi ji .

    It is not yet started when it starts give us opportunity to take the change.

  13. మొకురోజు, పరిపూర్ణాచారి, విశ్వకర్మ సెల్, కన్వీనర్ రంగారెడ్డి జిల్లా అర్బన్ Avatar
    మొకురోజు, పరిపూర్ణాచారి, విశ్వకర్మ సెల్, కన్వీనర్ రంగారెడ్డి జిల్లా అర్బన్

    76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో విశ్వకర్మల కోసం ఆలోచించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క నరేంద్ర మోడీ గారే యావత్తు దేశంలో విశ్వకర్మలు అందరి తరపున ప్రధానమంత్రి గారికి శతకోటి ధన్యవాదములు

  14. శ్రీనివాస శ్రీనివాసరావు Avatar
    శ్రీనివాస శ్రీనివాసరావు

    ఎలమంచిలి మండలం ఎలమంచిలి మున్సిపాలిటీ లో నివసిస్తున్నా ఎలమంచిలి మండలం నేను వడ్రంగి చేసుకుని జీవిస్తున్నాను

  15. ఎస్ అనిరుద్ Avatar
    ఎస్ అనిరుద్

    అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఎలమంచిలి మున్సిపాలిటీ లో ఉన్నటువంటి ఇ విరాట్ విశ్వకర్మ మండల కార్పెంటర్ సేవా సంఘం ఈ సంఘంలో సభ్యులు అందరూ వడ్రంగి పని చేసుకుంటూ జీవనోపాధి గడుపుతున్న వారే సభ్యులు మొత్తం సంఖ్య 85 మంది సభ్యులు ఉన్నారు

  16. కొండోజు ప్రభాకరాచారి, విశ్వబ్రాహ్మణ సెల్ కొ-కన్వినర్, భారతీయ జనతా పార్టి obc మోర్చా Avatar
    కొండోజు ప్రభాకరాచారి, విశ్వబ్రాహ్మణ సెల్ కొ-కన్వినర్, భారతీయ జనతా పార్టి obc మోర్చా

    మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలకు, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కులస్తులకు మొట్టమొదటి సారిగా విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పధకం ప్రవేశపెట్టినందులకు మా ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ కులస్తులు భారతీయ జనతా పార్టికి రుణపడి ఉన్నాం.

  17. కొండోజు ప్రభాకరాచారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సెల్ కొ-కన్వినర్ Avatar
    కొండోజు ప్రభాకరాచారి, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సెల్ కొ-కన్వినర్

    మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలకు, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కులస్తులకు మొట్టమొదటి సారిగా విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ పధకం ప్రవేశపెట్టినందులకు మా ధన్యవాదాలు. తెలుగు రాష్ట్రాల విశ్వబ్రాహ్మణ కులస్తులు భారతీయ జనతా పార్టికి రుణపడి ఉన్నాం.

  18. yashwanthula venkateshwar Avatar
    yashwanthula venkateshwar

    Thi is the best opportunity for vishwakarma members and union’s thank you our prime minister Narendra Modi sir..
    jai modi ji and jai Vishwa karma
    once again thank you sir

  19. Ramesh Achari Avatar
    Ramesh Achari

    కర్నూల్ జిల్లా ఆదోని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలిపారు.
    మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి, అలాగే మనకు ఈ పతకం ద్వారా అందరికీ లబ్ది పొందేందుకు వీలుగా అడుగులు వేస్తే మంచిది.

    1. Banda srinivasulu Avatar
      Banda srinivasulu

      Please tell me how can we apply

      1. schemesstudybizz Avatar
        schemesstudybizz

        Pls apply in meeseva

  20. Saikishore Avatar
    Saikishore

    Super

  21. SANB CHARY, ANDHRA PRADESH, PALNADU DIST. NARASARAOPET Avatar
    SANB CHARY, ANDHRA PRADESH, PALNADU DIST. NARASARAOPET

    VISWAKARMA RAYALTY FUTURE, MODI JINDABADH, JAI MODI VISWAKARMA

  22. సొంటే న ధర్మాజీ రావు Avatar
    సొంటే న ధర్మాజీ రావు

    ఎలమంచిలి మండల విశ్వకర్మ కార్పెంటర్ యువజన సేవా సంఘం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఎలమంచిలి మున్సిపాలిటీ ఈ సంఘాన్ని నడుపుతున్నాం ఈ సంఘం చేతులు వారి విశ్వకర్మ కులం దుస్తులు వడ్రంగి పనివారు సంఘం ఈ సంఘం సభ్యులు 85 మంది ఉన్నారు

  23. Laxman Avatar
    Laxman

    Super

  24. Naveen charylu Avatar
    Naveen charylu

    Goldsmith

  25. N.raja shekar chari Avatar
    N.raja shekar chari

    Good

    1. Simharaju shyam sunder Avatar
      Simharaju shyam sunder

      Hello sir viswakarma koushal lone ela ekkada applay cheyali ditails cheppandi plss

    2. Ranjith paindla Avatar
      Ranjith paindla

      Yes ok

You cannot copy content of this page