ఏపీలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంతింటి కల సహకారం చేసే దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. 2029 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత నుంచి ఇప్పటివరకు నిర్మించిన 3,00,192 ఇళ్లను పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 12 నవంబర్ 2025 న పంపిణీ చేశారు.
మరి ఈ ఇళ్ళను ఎవరికి పంపిణీ చేస్తున్నారు? ఏ పథకం కింద నిర్మించారు? అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఏపీలో 3,00,192 ఇళ్లకు పేదలకు పంపిణీ
2024 జూన్ 5 నుంచి అన్ని జిల్లాల్లో కలిపి ప్రభుత్వం 300192 ఇళ్లను PMAY కింద నిర్మించడం జరిగింది.
మొత్తం ఇళ్ల సంఖ్య – ఏ పథకం కింద వీటిని నిర్మించారు
- PMAY BLC (పట్టణ) ఇళ్లు – 2,28,034
పట్టణాల్లో నివసించే పేద కుటుంబాలు తమ సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు మంజూరైన యూనిట్లు ఇవి. - PMAY Gramin (గ్రామీణ) ఇళ్లు – 65,292
గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇల్లు లేదా స్థలం లేని అవసరమైన పేదలకు ఇచ్చే గృహాలు. - PMAY Janman ఇళ్లు – 6,866
ప్రత్యేక వర్గాలు / గిరిజన / అర్హత గల ఇతర లబ్ధిదారుల కోసం కేటాయించిన ఇళ్లు.
మొత్తం: 2,28,034 + 65,292 + 6,866 = 3,00,192 ఇళ్లు
PMAY కింద ఇల్లు మంజూరు అయిన beneficiary లిస్ట్
ఈ పథకం కింద ఇల్లు మంజూరైన బెనిఫిషరీ లిస్ట్ ను ఆన్లైన్లో కింద ఇవ్వబడిన లింకు ద్వారా తెలుసుకోవచ్చు. లేదా మీ సమీప గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు.

కొత్త గా ఇళ్లకు దరఖాస్తు చేసుకోవాలి
ఇల్లు లేని పేదలకు వచ్చే ఏడాదిలోపు ఇల్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం సంబంధిత లబ్ధిదారులు తమ సమీప గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు లేదా కింది లింక్ లో Eligibility check చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇల్లు లేని వారికి ఇల్లు కల్పించేలా అర్హులను గుర్తించాలని ఇటీవల ముఖ్యమంత్రి మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.


