ఏపీలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నెల అనగా నవంబర్ నుంచి వినియోగదారులపై విద్యుత్ భారం (Electricity charges ) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ఏపీలో విద్యుత్ చార్జీలు తగ్గింపు.. యూనిట్ కు 13 పైసలు
గత ప్రభుత్వ హయాంలో FPPP చార్జీలు అదనంగా వసూలు చేసి వినియోగదారులపై భారం మోపారని మంచి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ట్రూ డౌన్ సర్దుబాటులో భాగంగా వినియోగదారులపై యూనిట్ కి 13 పైసలు చొప్పున తగ్గిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో నవంబర్ నెల నుంచి వినియోగించే విద్యుత్ పై తదుపరి నెలలో వచ్చే బిల్లులో ఈ సర్దుబాటు ఉండనుంది.
ఉదాహరణకు : 300 యూనిట్లు ఖర్చు అయితే 300×13 పైసలు = 39 రూపాయలు తగ్గనుంది.
AP govt reduces electricity charges from November 2025.
ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ మరియు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారి ఇళ్లపై ఉచితంగా సోలార్ ప్యానల్స్ పెడతామని తద్వారా వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలలో 250 కోట్ల వ్యయంతో 69 విద్యుత్ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎలక్ట్రిసిటీ బిల్ ఆన్లైన్ పేమెంట్ మరియు ఇతర లింక్స్ కొరకు కింది పేజ్ ను వీక్షించండి.




