ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. డిల్లీలోని ఇండియన్ అగ్రికల్చర్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ పథకం తో పాటు మరొక పథకమైన పప్పు ధాన్యాల ఆత్మ నిర్భరత మిషన్ పథకాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.
రైతుల పండించే పంట ఉత్పాదకత, రైతులకు సరైన అవగాహన, సాగునీటిపారుదల సౌకర్యాలను పెంచడం, రైతులకు రుణ సౌకర్యం కల్పించడం వంటి ప్రధానమైన అంశాలను జోడించి కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని రూపొందించింది. ‘ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన’ (Prime Minister Dhana Dhanya Krishi Yojana) పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఈ పథకానికి వెచ్చించనుంది. మరి ఈ పథకం ఏంటి? ఈ పథకం వలన ఏమీ బెనిఫిట్స్, తెలుగు రాష్ట్రాల నుంచి ఏఏ జిల్లాలు ఎంపికయ్యాయి తదితర అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం
దేశవ్యాప్తంగా 100 జిల్లాలలో వ్యవసాయ ఉత్పాదకత, పంటల వైవిద్యం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త పథకమే ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం. ఇందులో భాగంగా సాగునీటి పారుదుల సౌకర్యాలను పెంచడం, గ్రామస్థాయిలో పంట దిగుబడును నిల్వ ఉంచుకునేందుకు గోదాములను ఏర్పాటు చేయడం మరియు రైతులకు రుణ లభ్యత పెంచడం వంటి ముఖ్యమైన సేవలను కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త పథకంలో మరొక 36 పథకాలను కలిపి అమలు చేయనున్నారు. ఈ పథకం లో భాగంగా పాడి రైతులకు కూడా లబ్ధి చేసేలా ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తుంది.

ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ఎలా అమలు చేస్తారు? What is PM Dhana Dhanya Krishi Yojana
- ముందుగా దేశవ్యాప్తంగా తక్కువ పంట దిగుబడి, తక్కువ విస్తీర్ణత, ఏడాది మొత్తం ఒకే పంటను పండించడం, తక్కువ రుణలభ్యత వంటి సమస్యలు ఉన్న 100 జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది.
- ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు జిల్లాలు అనగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీ సత్య సాయి జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలు చోటు సంపాదించుకున్నాయి.
- తెలంగాణ నుంచి నారాయణపేట, జనగాం, గద్వాల మరియు నాగర్ కర్నూలు జిల్లాలో చోటు సంపాదించుకున్నాయి.
- 2025 26 సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల పాటు ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం ఈ 100 జిల్లాలలో అమలు చేయడం జరుగుతుంది.
- ఇప్పటికే ఉన్నటువంటి 36 కేంద్ర పథకాలు మరియు రాష్ట్ర పథకాల తోటి ఈ పథకాన్ని అనుసంధానం చేస్తారు.
- పైన పేర్కొన్న విధంగా ఉత్పాదకత పెంచడం రుణలభ్యత ను పెంచడం సహా ఈ పథకం యొక్క లక్ష్యాలను సాధించడం కోసం జిల్లా రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
- పంచాయతీ, బ్లాక్ మరియు జిల్లాస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది.
- ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఏటా 24 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

ప్రధానమంత్రి ప్రారంభించిన మరొక పథకం పప్పు ధాన్యాలలో ఆత్మనిర్బరత కోసం మిషన్ పథకం. ఈ పథకం ద్వారా పప్పు ధాన్యాల ఉత్పాదికత పెంచి దిగుమతులను తగ్గించుకోవడమే ప్రభుత్వ ఉద్దేశం.
ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి

Leave a Reply