పోస్ట్ ఆఫిస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అంటే ఏమిటి?
పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒకటి. ఈ పథకం ఓపెన్ చేసిన వ్యక్తి కి ప్రతి నెలా స్థిర (Fixed) ఆదాయం లభిస్తుంది.
ప్రభుత్వం 2023 నుంచి ఈ పథకం ద్వారా జమ చేసే అమౌంట్ కు 7.10% వడ్డీ చెల్లిస్తుంది.
ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎంత వరకు జమ చేయవచ్చు?
భారత పౌరులు ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు.
వ్యక్తిగతంగా (single) గా అయితే కనీసం రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు జమ చేయవచ్చు. జాయింటు ఖాతా తో అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
10 సంవత్సరాలు నిండిన మైనర్ల పేరుపైన కూడా ఈ పథకంలో రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ ఖాతా మేజర్ ఖాతాగా మారుతుంది.
ఎంత ఆదాయం వస్తుంది?
ఒక వ్యక్తి ఖాతాలో గరిష్ఠ పరిమితి అనగా రూ. 9 లక్షల వరకు పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెల రూ. 5324 వరకు పొందొచ్చు.ఐదేళ్ల కాలంలో రూ.3,19,440 వడ్డీ లభిస్తుంది.
ఒకవేళ జాయింట్ ఖాతా అయితే గరిష్ఠ పరిమితి రూ.15 లక్షలు. ఈ పరిమితి వరకు పెట్టుబడి పెడితే నెలవారీగా మరింత ఆదాయం పొందొచ్చు.
మైనర్ పేరుపై గరిష్ఠ పరిమితి (రూ.3 లక్షల) వరకు పెట్టుబడి పెడితే, ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం నెలవారీగా రూ.1,775 లభిస్తుంది. అంటే ఐదేళ్లలో రూ.1,06,500 వడ్డీ వస్తుంది.
ఈ పథకానికి లాక్ ఇన్ ఉంటుందా?
ఈ పథకానికి 5 ఏళ్ల లాక్ ఇన్ పెరియడ్ ఉంటుంది. ప్రతి నెల వడ్డీ డబ్బులు మీ సేవింగ్ ఖాతా కు జమ అవుతాయి, మీ అసలు మొత్తం 5 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది.
అయితే లాక్ పీరియడ్ పూర్తి అయ్యాక పెట్టుబడిదారులు తమ అభీష్టానుసారం తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. లేదా ఉపసంహరించుకోవచ్చు
ఖాతా ఎలా తెరవాలి?
ఖాతాను వ్యక్తిగతంగా, జాయింటుగా (గరిష్ఠగా ముగ్గురు వ్యక్తులు), మైనర్ ఖాతా (10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై) తెరవొచ్చు. ఒకే ఖాతా తెరవాలనే నిబంధన లేదు. కానీ, ఒక ఖాతాలో ఎంత వరకు జమ చేయవచ్చనే దానిపై పరిమితి ఉంది.
ఈ పథకం ద్వారా వచ్చిన TDS నుంచి మినహాయింపు ఉంటుంది అయితే 5 సంవత్సరాల లాక్ ఇన్ ఉన్నప్పటికీ ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.
ముందస్తు విత్‌డ్రా చేసుకోవచ్చా: ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు. అయితే కొంత పెనాల్టీ వర్తిస్తుంది. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత ముందస్తు విత్‌డ్రాలను అనుమతిస్తారు. ఖాతా తెరిచిన ఏడాది తర్వాత/ మూడేళ్ల ముందు విత్‌డ్రా చేస్తే 2%, మూడేళ్ల తర్వాత/ఐదేళ్లకు ముందు అయితే 1% పెనాల్టీ వర్తిస్తుంది.ఖాతా బదిలీ: పోస్టాఫీసు ఎంఐఎస్ ఖాతాను ఒక పోస్టాఫీసు నుంచి దేశంలో ఏదైనా పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు.
Leave a Reply