Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

Annadata Sukhibava Payment Issues – Complete Pattadar Aadhaar Seeding Guide for Farmers

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు మొదటి విడత నగదు రూపాయలు ₹5000/- ను ఆగస్టు 2, 2025 న విడుదల చేసింది. రాష్ట్రంలోని ఎక్కువమంది రైతులకు నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటికీ, ఇంకా కొంతమంది రైతులకు పేమెంట్ క్రెడిట్ కాలేదు. ప్రభుత్వం పేమెంట్ విడుదల చేసినప్పటికీ, భూమి మరియు ఆధార్ లింక్ సమస్యలు లేదా ఇతర కారణాల వలన కొన్ని ఖాతాల్లో నగదు జమ కావడం లేదు.

పేమెంట్ సమస్యలకు ప్రధాన కారణాలను, Pattadar Aadhaar Seeding అనే కీలక ప్రక్రియను, దానిని ఎలా పూర్తి చేయాలో మరియు తర్వాత పేమెంట్ ఎలా వస్తుందో వివరంగా తెలుసుకుందాం.


పేమెంట్ క్రెడిట్ కాకపోవడానికి ప్రధాన కారణాలు

  • కనీసం 10 సెంట్లు భూమి లేకపోవడం
  • రైతు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ కాకపోవడం
  • రైతు సేవ కేంద్రం వద్ద eKYC పూర్తి చేయకపోవడం
  • ప్రభుత్వం పేర్కొన్న గత 16 కారణాల్లో ఏదైనా కారణం ఉండటం
  • వెబ్ ల్యాండ్ (Webland) రికార్డులో రైతు ఆధార్ నంబర్ లింక్ కాకపోవడం

What is Pattadar Aadhaar Seeding?

Pattadar Aadhaar Seeding అంటే రైతు భూమి రికార్డులో (Webland) రైతు ఆధార్ నంబర్ లింక్ చేయడం. ఈ లింక్ ఉండే రైతులకు మాత్రమే ఆ భూమికి సంబంధించిన అన్నదాత సుఖీభవ నగదు పేమెంట్ క్రెడిట్ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ ప్రక్రియను తప్పనిసరి చేసింది.


Required Documents for Pattadar Aadhaar Seeding

  • పట్టాదారు పాస్‌బుక్ లేదా తాజా ROR 1B జిరాక్స్
  • రైతు ఆధార్ కార్డు జిరాక్స్
  • పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
    (డౌన్లోడ్ లింక్ ద్వారా పొందవచ్చు)

అప్లికేషన్ ఫారంలో జిల్లా, మండలం, గ్రామం, ఖాతా నంబర్, భూమి వివరాలు, Seeding Type (Aadhaar), మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, రైతు సంతకం తప్పనిసరి.


Where to Apply?

  • గ్రామ/వార్డు సచివాలయం లేదా మీ సేవ కేంద్రంలోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సొంత గ్రామంలోనే దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు – రాష్ట్రంలోని ఏ సచివాలయం/మీ సేవ అయినా సరే.
  • భూమి యజమాని వ్యక్తిగతంగా హాజరై బయోమెట్రిక్ ఇవ్వాలి.
  • దరఖాస్తు ఫీజు ₹50/- మాత్రమే.

Pattadar Aadhaar Seeding Step-by-Step Process

1. రీ సర్వే అవ్వని గ్రామాల కోసం:

  1. AP Seva Portal → Mee Seva Service → Revenue Department
  2. Mobile Number & Pattadar Aadhaar Seeding → Farmer Aadhar Number నమోదు
  3. Authentication Type → Biometric / Iris
  4. District, Mandal, Village Secretariat, Khata Number నమోదు
  5. Seeding – Aadhaar ఎంచుకొని Authentication Complete చేయాలి

2. రీ సర్వే అయిన గ్రామాల కోసం:

  1. AP Seva Portal → Revenue → Pattadar Aadhaar Seeding to LP Number
  2. భూమి వివరాలు, ఆధార్ వివరాలు నమోదు
  3. Biometric Authentication పూర్తి చేయాలి

తర్వాత సంబంధిత VRO మరియు తాసిల్దార్ ఆమోదం తర్వాత వెబ్ ల్యాండ్‌లో ఆధార్ లింక్ పూర్తవుతుంది.


After Seeding – Payment Process

  • లింక్ పూర్తయిన రైతులు ఆగస్టు 25, 2025 లోపు గ్రామ వ్యవసాయ కార్యదర్శి వద్ద అర్జీ నమోదు చేయాలి.
  • అమోదం తర్వాత ప్రభుత్వం వెంటనే పేమెంట్ విడుదల చేస్తుంది.

How to Check Pattadar Aadhaar Seeding Status

  1. సచివాలయం/మీ సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఇచ్చిన అప్లికేషన్ నంబర్ ఉంచుకోండి.
  2. Status Check Link లో అప్లికేషన్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  3. Approved అంటే సీడింగ్ పూర్తయింది. Pending అంటే VRO లేదా తాసిల్దార్‌ను సంప్రదించాలి.

Important Links

గమనిక: పేమెంట్ సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఆగస్టు 25, 2025 లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియ పూర్తి చేయండి.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page