ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ (APDASCAC) విడుదల చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులు ఆర్థిక భారం లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు.

అర్హతలు
- ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి.
- 70% పైగా వైకల్యం కలిగి, వయసు 18 నుండి 45 ఏళ్లలోపు ఉండాలి.
- కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
- వార్షిక ఆదాయం ₹3 లక్షల లోపు ఉండాలి.
- లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- సొంత వాహనం లేకపోవాలి.
- గతంలో ఇలాంటి వాహనం పొందకపోవాలి.
Note: గతంలో దరఖాస్తు చేసినప్పటికీ వాహనం మంజూరు కాలేకపోతే, మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
కావలసిన పత్రాలు
- జిల్లా మెడికల్ బోర్డు ఇచ్చిన వికలాంగ ధ్రువపత్రం.
- ఆధార్ కార్డు.
- SSC ధ్రువపత్రం.
- SC/ST అయితే కుల ధ్రువీకరణ పత్రం.
- దివ్యాంగుల పాస్‌పోర్టు సైజు ఫోటో.
- ఆదాయ ధ్రువీకరణ పత్రం (01-01-2022 తరువాత జారీ చేయబడినది).
- Bonafide Certificate (విద్యార్థి అయితే).
- ముందుగా ఎటువంటి వాహనం పొందలేదని, అన్ని వివరాలు సరైనవని సెల్ఫ్ డిక్లరేషన్.

రిజర్వేషన్ వివరాలు
- మహిళలు – 50%
- పురుషులు – 50%
- SC – 16%
- ST – 7%
- General – 77%
Note: SC & ST లేదా మహిళలు & పురుషుల కేటగిరీలో అర్హులైన దరఖాస్తులు రాకపోతే, ఇతర కేటగిరీలకు మార్చబడతాయి.
ప్రాధాన్యత
- PG విద్యార్థులు
- Self/Wage/Salary పొందుతూ డిగ్రీ చేసిన వారు
దరఖాస్తు చివరి తేదీ
ఆన్లైన్ ద్వారా 2025 అక్టోబర్ 31 లోపు దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను అప్లోడ్ చేయాలి.

ముఖ్య గమనిక
ఈ పథకం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగులు సులభంగా స్వతంత్రంగా ప్రయాణం చేయవచ్చు. అందువల్ల అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.

Leave a Reply