నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

నేతన్న భరోసా @ 25000.. చేనేత కార్మికులకు కొత్త పథకం

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గత ప్రభుత్వం నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. గత ప్రభుత్వం ఇచ్చిన 24 వేలకి ఒక వెయ్యి అదనంగా ప్రస్తుత ప్రభుత్వం నేతన్న భరోసా కింద 25 వేలు ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది.

నేతన్న భరోసా కింద 25000.. ఇతర బెనిఫిట్స్ ఇవే..

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపిన బెనిఫిట్స్ ఇవే..

  • చేనేత కార్మికులకు వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తూ ఆమోదం
  • చేనేత మగ్గాలపై 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు. పవర్ మగ్గాలపై 500 యూనిట్ల మేర ఉచిత విద్యుత్తు.
  • నేతన్న భరోసా పథకానికి శ్రీకారం.
  • నేతన్న భరోసా అనే కొత్త పథకం ద్వారా చేనేత కార్మికులకు ప్రతి ఏటా 25 వేలు ఇవ్వనున్న ప్రభుత్వం.
నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవం అనగా ఆగస్టు 7 నుంచి ఈ బెనిఫిట్స్ అందుతాయి

గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులకు ప్రతి ఏటా నేతన్న నేస్తం కింద అప్పటి ప్రభుత్వం 24,000 ఏటా జమ చేస్తూ వచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం ఒక వెయ్యి అదనంగా వారికి జోడించి 25000 త్వరలో అందించనుంది.

నేతన్నల సంక్షేమం కోసం 648 కోట్లు కేటాయించిన ప్రభుత్వం. అంతేకాకుండా వారి కోసం త్రిఫ్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

You cannot copy content of this page