Andhra Pradesh Ration Card Correction: రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం రైస్ కార్డ్ (Ration Card) లో Age, Gender, Relationship, Address వంటి వివరాలను మార్చుకునే అవకాశం కల్పించింది. గతంలో ఉన్న “Rice Card Address Change” సేవను “Change of Details in Rice Card”గా మారుస్తూ, వివిధ రకాల డేటా సరిచేసుకునే అవకాశం లభిస్తోంది.
రైస్ కార్డ్ వివరాలను ఎందుకు మార్చాలి?
- పుట్టిన తేదీలు తప్పుగా ఉన్నచో మార్చుకోవచ్చు (e.g. SSC/DOB ఆధారంగా)
- లింగం తప్పుగా నమోదై ఉంటే (e.g. ఆధార్ ఆధారంగా)
- కుటుంబ బంధం తప్పుగా నమోదై ఉంటే
- చిరునామా మార్పు అవసరమైతే
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
మీ రైస్ కార్డ్ ఉన్న గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి Change of Details in Rice Card సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- గ్రామ సచివాలయం అయితే: డిజిటల్ అసిస్టెంట్
- వార్డు సచివాలయం అయితే: వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ
అప్లికేషన్ కు అవసరమైన డాక్యుమెంట్లు
- దరఖాస్తు ఫారం (Download)
- రైస్ కార్డు జిరాక్స్
- ప్రతి సభ్యుని ఆధార్ జిరాక్స్
- DOB సర్టిఫికెట్ లేదా ఆధార్ ద్వారా పుట్టిన తేదీ ప్రూఫ్
- బంధుత్వం చూపించే డాక్యుమెంట్లు
- లింగం మార్పుకు ఆధారమైన డాక్యుమెంట్
అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
- సచివాలయంలో దరఖాస్తు చేసిన తర్వాత గ్రామ రెవెన్యూ అధికారి / వార్డు రెవెన్యూ సెక్రటరీ లాగిన్ లో ఆమోదం తెలుపుతారు.
- eKYC GSWS Employees Mobile App ద్వారా తీసుకోవాలి.
- ఆమోదం తర్వాత తహసీల్దార్ (MRO) తుది ఆమోదం ఇస్తారు.
- మొత్తం ప్రక్రియ 21 రోజుల లోపు పూర్తవుతుంది.
అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
దరఖాస్తు చేసిన తర్వాత సచివాలయంలో ఇచ్చే రసీదులో అప్లికేషన్ నంబర్ ఉంటుంది. దాన్ని ఉపయోగించి క్రింద తెలిపిన లింక్ లో మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేయవచ్చు:
🔗 Check Application Status Here
👉 Menu: Service Request Status Check లో అప్లికేషన్ నంబర్ & క్యాప్చా నమోదు చేయండి.
కొత్త రేషన్ కార్డ్ ఎలా పొందాలి?
MRO తుది ఆమోదం తర్వాత ప్రజలకు కొత్తగా QR Code Enabled Smart Ration Card అందించబడుతుంది. ఇది ATM కార్డ్ సైజులో ఉంటుంది.
మీరు సభ్యులను జోడించడం, తొలగించడం, కార్డును విభజించడం వంటి సేవలు పొందిన తర్వాత, మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని దేశవ్యాప్తంగా రేషన్ కార్డ్ గా ఉపయోగించవచ్చు.
Leave a Reply