Household Mapping Splitting Process -హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ప్రక్రియ

Household Mapping Splitting Process -హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ప్రక్రియ

అన్ని ప్రభుత్వ పథకాలకి ప్రామాణికంగా తీసుకునే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ రావడమైతే జరిగింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ విభజనకు సంబంధించి ఆప్షన్ను కొత్తగా ఇవ్వటం జరిగినది. ఈ ఆప్షన్ ను Household Split అని పిలవటం జరుగుతుంది.

ప్రస్తుతానికి ఈ ఆప్షన్ ద్వారా ఎవరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో అయితే రెండు పెళ్లి అయిన కుటుంబాలు ఉండి, విడివిడిగా జీవిస్తున్నారో వారు రెండు హౌస్ ఓల్డ్లుగా విభజించే అవకాశం ఉంది. ఈ సర్వీసు గ్రామ వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంటుంది. 

రైస్ కార్డు విభజనకు మరియు ఈ సర్వీస్ కు ఎటువంటి సంబంధం లేదు. రైస్ కార్డులో విడివిడిగా ఉండి హౌస్ హోల్ మ్యాపింగ్ లో ఒకే కుటుంబంలో ఉన్నట్టయితే వారు తప్పనిసరిగా ఈ ఆప్షన్ ద్వారా రెండు హౌస్ హోల్డ్ గా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా ప్రభుత్వం అందించే పథకాలు గాని, సర్వేలు గానీ హౌస్ హోల్డ్ మెంబర్ల ప్రాప్తికి అందించడం జరుగుతుంది.

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వీస్ కు రైస్ కార్డ్ (రేషన్ కార్డ్) సర్వీస్ కు సంబంధం లేదు. రైస్ కార్డ్ లేకపోయినా లేదా కేన్సిల్ అయ్యిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ అయ్యాక మరలా తిరిగి అప్లయ్ చేసుకోవాలి.కావున ముందు హౌజ్ హోల్డ్ స్ప్లిట్ గురించి తెలుసుకుందాం.

Household Mapping Splitting Case 1

హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు, కోడలు ఒక మ్యాపింగ్ లో ఉంటే నేరుగా సచివాలయం లో సర్వీస్ అప్లయ్ చేసుకోవచ్చు. 

Household Mapping Splitting Case 2

హౌస్ హోల్డ్ లో తల్లి, తండ్రి, కొడుకు,  ఒక మ్యాపింగ్ లో ఉండి కోడలు వాళ్ళ పుట్టింటి హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది.టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.దీనికి గాను మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా DA లాగిన్ లో మ్యారెజీ మైగ్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి. DA తదుపరి PS లాగిన్ అంతిమంగా ఎంపిడిఒ లాగిన్ లో ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు హౌజ్ హోల్డ్ లో కోడలు add అవుతారు. అప్పుడు ఈ ఫ్యామిలీ case 1 లా మారుతుంది. Verify procedure of case1.

Household Mapping Splitting Case 3

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు, కోడలు ఉంటే వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు ఇంకా అవకాశం ఇవ్వలేదు. కానీ త్వరలోనే అవకాశం ఇస్తారు.

Household Mapping Splitting Case 4

హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి/తండ్రి (ఒకరు మరణించిన) ఒకరు మాత్రమే ఉండి కొడుకు తో కలిసి హౌజ్ హోల్డ్ లో ఉంటూ కోడలు వాళ్ళు పుట్టింటి వాళ్ళతో హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే,రెండు టాస్క్ లు చేయవలసి ఉంటుంది.టాస్క్ 1 కోడలిని HH మ్యాపింగ్ లో add చేయాలి.దీనికి గాను మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం. అదే విధంగా DA లాగిన్ లో మ్యారెజీ మైగ్రేషన్ సర్వీస్ రిక్వెస్ట్ అప్లయ్ చేయాలి, దీనికి గాను భార్య, భర్త ఇద్దరు వేలిముద్రలు బయోమెట్రిక్ device lo వేయాలి కనుక భార్య భర్త తప్పని సరిగా సచివాలయం కు హాజరు అవ్వాలి. DA తదుపరి PS లాగిన్ అంతిమంగా ఎంపిడిఒ లాగిన్ లో ఈ రిక్వెస్ట్ అప్రూవ్ అయితే అప్పుడు హౌజ్ హోల్డ్ లో కోడలు add అవుతారు. అప్పుడు ఈ ఫ్యామిలీ case 3 లా మారుతుంది. Verify Case 3.

Household Mapping Splitting Case 5

విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఒక హౌజ్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉంటే కోర్టు ద్వారా పొందిన డివోర్స్ డిక్రీ ఉంటే విడి విడి హౌజ్ హోల్డ్ లుగా add అవ్వచ్చు.తల్లి, తండ్రి, కొడుకు, కోడలు లను ప్రామాణికం గా తీసుకున్నాం కానీ ఇక్కడ కూతురు అల్లుడు, తమ్ముడు మరదలు, ఇలా అన్నీ రిలేషన్స్ కు ఈ case లు వర్తిస్తాయి.

Service Type for Household Mapping Splitting

ఈ సర్వీసు క్యాటగిరి B కింద కు వస్తుంది.

Application Fee for Household Mapping Splitting

సర్వీసుకు సంబంధించి ఎటువంటి ఫీజు ఉండదు.

SLA Period for Household Mapping Splitting

సర్వీసు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు అందించడం జరుగుతుంది.

Required Documents for Household Mapping Splitting

సర్వీసు పొందుటకు కింద తెలిపిన వాటిలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది.

  1. వివాహ ధ్రువీకరణ పత్రము
  2. రైస్ కార్డు
  3. ఆరోగ్యశ్రీ కార్డు
  4. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
  5. పాస్పోర్టు
  6. ఆధార్ కార్డు

రెండు కుటుంబాలు విడిగా ఉంటున్నందుకు ప్రూఫ్ :

  1. ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా నిర్ధారించడం జరుగుతుంది.

Work Flow for Household Mapping Splitting

PS Gr-VI(DA) /WEDPS –> WEA / WWDS –> PS / WAS –> MPDO / MC

Application Process for Household Mapping Splitting

PS Gr-VI(DA) / WEDPS 

AP Seva పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. Home Page లొ GSWS Services లొ Splitting Of Household Members Application Form పై క్లిక్ చేయాలి.

Basic Details లొ దరఖాస్తు దారుని Aadhaar Number ఎంటర్ చేసాక Pre-Fill పై క్లిక్ చేస్తే Automatic గ 

  • Citizen Name, 
  • Gender, 
  • Caste,
  •  DOB, 
  • Door No, 
  • District, 
  • Mandal/Municipality, 
  • Village / Ward Sachivalayam, 
  • PIN Code వివరాలు వస్తాయి . 

మిగతా వివరాలు అనగా 

  • Father / Husband Name, 
  • Religion, 
  • Qualification, 
  • Marital Status, 
  • Mobile Number, 
  • Post Office, 
  • Postal Village ను ఎంటర్ చేసి, 

Continue పై క్లిక్ చేయాలి.

Application Form లొ దరఖాస్తు దారుని ఆధార్ ఏ హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉందొ ఆ కుటుంబ సభ్యుల అందరి వివరాలు మరియు వారి eKYC స్టేటస్ తో చూపిస్తుంది. కుటుంబ విభజనకు తప్పనిసరిగా అందరి eKYC స్టేటస్ Yes (Y) అని ఉండాలి. No (N) అని ఉంటే అప్లికేషన్ చేయటానికి అవ్వదు. N ఉన్నవారు వాలంటీర్ వద్ద వారి GSWS Volunteer అనే మొబైల్ అప్లికేషన్ లొ eKYC చేపించుకోవాలి.

Select Head of Family లొ ఆ కుటుంబ లొ ఎక్కువ వయసు ఉన్న మహిళకు(Female) సెలెక్ట్ చేసుకోవాలి. అలా లేనించే ఎక్కువ వయసు ఉన్న పురుషుడును(Male) సెలెక్ట్ చేసుకోవాలి.ఎవరిని అయితే సెలెక్ట్ చేస్తారో వారు కింద లిస్ట్ లొ Self గ చూపించటం జరుగుతుంది.

Service Type లొ Marriage Split సెలెక్ట్ చేసుకోవాలి.

Marital Status లొ అందరి వివాహ స్థితి ను ఎంచుకోవాలి.

Relationship లొ Head తో సంబంధం ఎంచుకోవాలి. ఇక్కడ వారు Male / Female ప్రకారం Relationship చూపించటం జరుగును. 

Split Type లొ ఎవరు అయితే పాత హౌస్ మాపింగ్ లొ ఉండాలి అనుకుంటున్నారో వారిని Existing Household లొ కొత్తగా హౌస్ హోల్డ్ మాపింగ్ లొ ఉండాలి అనుకున్నవారిని Marriage అని సెలెక్ట్ చేయాలి.ఇక్కడ ఒక సారి ఒక కుటుంబం మాత్రమే విభజన కు అవకాశం ఉంటుంది. తరువాత Preview Split పై క్లిక్ చేయాలి.

Household 1 Member Details మరియు Household 2 Member Details చూపితుంది. రెండిట్లో కుటుంబ పెద్దను ఎంచుకోవాలి. ఇక్కడ ఎక్కువ వయసు కలిగిన Female వారు లేనిచో Male Gender ను HOF గా ఎంచుకోవాలి. Relationships HOF అనుగుణంగా ఎంచుకోవాలి.

Household 1 & 2 లొ ఎవరిది అయిన ఒకరి ఆధార్ నెంబర్ తో బయోమెట్రిక్ / OTP (ఆధార్ ను లింక్ అయిన మొబైల్ నెంబర్ కు వస్తుంది ) తో eKYC చెయ్యాలి .

Documents Upload సెక్షన్ లొ Household 1 & 2 కు సంబందించి ముందుగా చెప్పుకున్న వాటిలో ఎదో ఒకటి ఎంచుకొని , అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డులను కూడా అప్లోడ్ చెయ్యవచ్చు. అందులో C/O లొ వివరాలు Split కు అనుగుణంగా ఉంటే సరిపోతుంది. Show Payment పై క్లిక్ చేయాలి. రసీదు ను సిటిజెన్ కు అందజేయాలి. అందులో ఉండే అప్లికేషన్ తో సిటిజెన్ వారి అప్లికేషన్ ను ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

WEA/WWDS 

AP SEVA పోర్టల్ లొ లాగిన్ అవ్వాలి. HOME PAGE లొ HH నెంబర్ తో అప్లికేషన్ కనిపిస్తుంది ఆ నెంబర్ పై క్లిక్ చేయాలి. దరఖాస్తు దారుని 

  • Basic Details,
  •  Present Address, 
  • Applicant Details, 
  • List Of Documents 

ఒక సారి సరి చుకోవాలి.

వెరిఫికేషన్ కు సంబంధించి నాలుగు ముఖ్యమైన ప్రశ్నలు కనబడతాయి వాటికి అనుగుణంగా అన్నీ సరిగా ఉంటే YES అని సరిగా లేకపోతే NO అని సెలక్ట్ చేయాలి.

అడిగే ప్రశ్నలు 

  1. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/Passport/Aadhaar for the resultant Household 1 is valid?
  2. Whether Marriage Certificate/ Rice Card/Arogyasri Card/Family Member Certificate/ Passport/Aadhaar for the resultant Household 2 is valid?
  3. Whether at least 2 alive married couples are present in the existing Household?
  4. Whether the two married couples live separately

Remarks లొ అప్లికేషన్ తరువాత స్థాయికి పంపించాలి అనుకుంటే Recommended అని రిజెక్ట్ చేయాలి అంటే Not Recommended అని సెలెక్ట్ చేయాలి.Check Box టిక్ చేసి Verification Document Upload చేసి Forward పై క్లిక్ చేయాలి.

PS/WAS 

పంచాయతీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రెటరీ వారి లాగిన్ కొత్తగా క్రియేట్ చేయవలసి ఉంటుంది. ముందుగా మ్యారేజ్ సర్టిఫికెట్ ఆమోదం కొరకు ఉపయోగించే లాగిన్ దీనికి పనికిరాదు. మ్యారేజ్ సర్టిఫికెట్ లాగిన్ అనేది పంచాయతీ DDO లాగిన్ పై ఉంటుంది. కానీ ఇప్పుడు క్రియేట్ చేయబోయే లాగిన్ అనేది ఆ సచివాలయ పంచాయితీ కార్యదర్శి లేదా వార్డ్ అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ గా పనిచేస్తుంది ఉదాహరణకు WEA/WWDS వారి లాగిన్ లా ఉంటుంది.

User name :

SECCODE-PS/WS@apgsws.onmicrosoft.com

Password :

Re$t@Ap@SECCODE 

SECCODE – SAACHIVALAYAM CODE

లాగిన్ అయిన వెంటనే హోం పేజీలో Request List లొ WEA/WWDS వారు ఆమోదం చేసిన లిస్ట్ చూపిస్తుంది. అప్లికేషన్ పై క్లిక్ చేయాలి. అవసరం మేరకు ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత WEA/WWDS వారి రిమార్కులను వెరిఫికేషన్ చేసిన తరువాత WEA/WWDS వారి లాగిన్ లొ ప్రశ్నలు చూపిస్తాయి. అన్ని సరిగా ఉంటే Yes అని సరిగా లేకపోతే NO అని సెలెక్ట్ చేయాలి. WEA/WWDS వారి రిమార్క్ సరిగా ఉంటే Whether The WEA/WWDS Remarks Are Valid లొ Yes అని సరిగా లేనిచో No అని సెలెక్ట్ చేయాలి. Verification Document Upload చేసి అన్ని సరిగా ఉంటే Recommended అని లేనిచో Not Recommended అని సెలెక్ట్ చేసి చెక్ బాక్స్ టిక్ చేసి ఫార్వర్డ్ చేయాలి.

MPDO / MC 

MPDO / MC వారి AP Seva పోర్టల్ లాగిన్ లొ అప్లికేషన్ పై క్లిక్ చేసాక WEA/WWDS & PS/WAS వారి రిమార్కులను పరిగణించి ఆమోదం తెలుపవలసి ఉంటుంది. Digital Signature ద్వారా తుది ఆమోదం చేయవలసి ఉంటుంది.

Application Status :

Step 1 : కింద లింక్ పై క్లిక్ చేయాలి. 

Step 2 : Service Request Status Check అనే ఆప్షన్ లొ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి Search పై క్లిక్ చేయాలి.

Step 3 : Application Status చూపిస్తుంది. Green Color లొ ఉంటే అవి పూర్తి అయినట్టు అర్థము. Orange Color లొ ఉంటే వారి వద్ద పెండింగ్ లొ ఉన్నట్టు అర్థము.

Note :

  1. Widow
  2. Widower
  3. Single Parent House Hold Split Option 

త్వరలో ఇవ్వటం జరుగును. అందుకు గాను కుటుంబంలో ఒక జంట ఉండవలెను. 

Click here to Share

6 responses to “Household Mapping Splitting Process -హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ప్రక్రియ”

  1. Moses Tirumala Avatar
    Moses Tirumala

    నమస్తే

    ప్రస్తుతం నేను మా అన్నయ్య మరియు మా అమ్మ ఒక HH Mapping లో ఉన్నాం.
    అన్నయ్యకు పెళ్లి అయిపొయింది, సో అన్నయ్యని వదిన ని వేరే HH మాపింగ్ ల స్ప్లిట్ చేయొచ్చా ?

  2. Sivachippada Avatar
    Sivachippada

    HH mapping split చేసాము mpdo గారు approval కూడా అయింది కానీ ఇంకా data split అవ్వలేదు

    1. Siva Avatar
      Siva

      Very poor government.. House hold mapping split introduced for public stunt.. Not for splitting really. Providing only mpdo approval certificates. That’s it

    2. AA Avatar
      AA

      CHECK NOW

  3. Rama Mohan Rao Oleti Avatar
    Rama Mohan Rao Oleti

    How many days will take to split family in household mapping after MPDO approval.

  4. Chandu Avatar
    Chandu

    Hosue hold split aeindhi aeina old date ne display auuthundhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page