ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోయినప్పటికీ భార్యకి పెన్షన్ రావడానికి చాలా సమయం పట్టేది. ఆ విధంగా భర్తను పోగొట్టుకున్న భార్య పెన్షన్ కూడా లేకుండా దుర్భర జీవితం గడపాల్సి వచ్చేది. తిరిగి పెన్షన్ భార్యకు ఇచ్చేందుకు చాలా సమయం పట్టేది. అయితే ఈ బాధలు అన్నిటిని అర్థం చేసుకున్నాను కూటమి ప్రభుత్వం హుటాహుటిన ఇటువంటి వారి లబ్ధిదారులను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో డేటాని నమోదు చేయించింది. ఇటువంటి వారికి తక్షణమే వితంతు పెన్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంది.
ఆగస్టు నెల నుంచి 1,09,155 మందికి వితంతు పెన్షన్
ఆగస్టు 2025 నుంచి ఒకేసారి 1,09,155 మందికి వితంతు పెన్షన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ తీసుకుంటున్న భర్తను పోగొట్టుకొని వితంతుగా మారిన భార్యలకు పెన్షన్ తో పాటు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వితంతువులకు కూడా ప్రభుత్వం ఆగస్టు నెల నుంచి పెన్షన్ ఇస్తున్నట్లు సమాచారం. వీరికి ప్రతినెల 4000 రూపాయల పెన్షను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై 43.66 కోట్ల అదనపు భారం పడుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6281768 పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా చేరే పెన్షన్ లబ్ధిదారుల తో కలిపి ఈ సంఖ్య సుమారు 64 లక్షలకు చేరే అవకాశం ఉంది.
Leave a Reply