గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ముఖ్య గమనిక. సిలిండర్ తీసుకున్న ప్రతిసారి డెలివరీ బాయ్ కి అదనంగా డబ్బులు చెల్లిస్తున్నారా ? అయితే ఇక ఆపేయండి.
ప్రస్తుతం వినియోగదారుల నుంచి అదనంగా ₹30 నుంచి ₹50 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిలిండర్ ధర కన్నా ఇది అదనం. ఆన్లైన్ లో డబ్బులు చెల్లించిన వారి నుంచి కూడా ఈ చార్జీలు వసూలు చేస్తున్నారు.
గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేసే వారికి అదనంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని HPCL చీఫ్ జనరల్ మేనేజర్ CK నరసింహ తెలిపారు.
సంబంధిత డిస్ట్రిబ్యూటర్లు సిలిండర్ ను ప్రజలకు ఉచితంగా చేర్చాల్సి ఉంటుంది. ఈ చార్జీలు వినియోగదారులు చెల్లించే బిల్లులోనే ఉంటుంది. అంటే సీలిండర్ ధర లో నే ఇది కూడా ఉంటుంది.
కాబట్టి అదనంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
ప్రజా ప్రయోజనం కోసం ఒక వినియోగదారుడు అడిగిన RTI సంబంధించి ఆయన ఈమేరకు క్లారిటీ ఇచ్చారు.
Leave a Reply