ఆడబిడ్డ నిధికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు. ఈ పథకం అమలు చేయాలంటే ఏపీని అమ్ముకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో విధంగా ఎలా అమలు చేయాలో ప్రయత్నిస్తున్నామని అన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో చేపట్టిన సుపరిపాలనకు తొలి అడుగు సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేరుస్తున్నామని, అయితే ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే నెలకి 1500 రూపాయల హామీ మాత్రం మిగిలి ఉందని చెప్తూ మంత్రి పై విధంగా కీలక వ్యాఖ్యలు చేయడం సర్వత్ర చర్చకు దారి తీసింది.
మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించారు. ఆడబిడ్డ నిధిని (Aadabidda Nidhi) కూడా త్వరలో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి (Minister Anam Ramanarayana Reddy) తెలిపారు. ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధితో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చెప్పిన మాట చేసి చూపించే వ్యక్తి చంద్రబాబునాయుడు అని అభివర్ణిచంచారు. మంగళవారం నంద్యాల జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. పలు కార్యక్రమాల్లో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను చాలామంది అవహేళన చేశారని… కాని ప్రజలు విశ్వసించారు, గెలిపించారని ఉద్గాటించారు.
Leave a Reply