ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

ఏపీలో ఉచిత సిలిండర్ కు ఇకపై ముందే డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు

ఆంధ్రప్రదేశ్ లో అటు అభివృద్ధిని మరియు ఇటు సంక్షేమాన్ని  సమానంగా పరుగులు పెట్టిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా లబ్ధిదారుల సౌకర్యార్థం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి(free gas cylinder scheme Andhra Pradesh) సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించి ఇకపై లబ్ధిదారులు ముందస్తు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా పైలెట్ ప్రాజెక్టు చేపట్టింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ కి ముందస్తు డబ్బులు చెల్లించే పని లేదు

దీపం పథకం కింద కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందాలంటే ముందుగా గ్యాస్ ఏజెన్సీకి డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని రోజులకు ప్రభుత్వం సిలిండర్ డబ్బులు మొత్తాన్ని రాయితీ రూపంలో లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఎం చేస్తున్న విషయం తెలిసిందే.

ఇకపై లబ్ధిదారులు ఎటువంటి డబ్బులు చెల్లించకుండా సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో రాయితీ అమౌంట్ జమ చేసేలా ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. పైలెట్ ప్రాజెక్టు కింద ఎన్టీఆర్ జిల్లాలో 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

ఈ పైలెట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో గ్యాస్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో అమౌంట్ జమవుతుంది అదే అమౌంట్ ను సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు ఏజెన్సీకి లబ్ధిదారుడు చెల్లించవచ్చు. తద్వారా లబ్ధిదారుడు సొంతంగా తన డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు.

|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో జాయిన్ అవ్వండి. క్లిక్ చేయండి

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page