రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్

రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్

ఏపీలో రేషన్ కార్డుకు సంబంధించి  ప్రస్తుతం అన్ని ముఖ్యమైన ఆప్షన్స్ ను ప్రభుత్వం కల్పించడం జరిగింది. తద్వారా లబ్ధిదారులకు రేషన్ కార్డ్ కి సంబంధించినటువంటి అన్ని సమస్యలు తీరిపోయి కొత్త రేషన్ కార్డు కూడా మంజూరయ్యే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించి అందుబాటులో ఉన్న ఆప్షన్స్

ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కింద ఇవ్వబడిన ముఖ్యమైన ఆప్షన్స్ను ప్రభుత్వం లబ్ధిదారులకు కల్పించడం జరిగింది.

అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు

రేషన్ కార్డులో సభ్యులను జోడించడం

రేషన్ కార్డులో సభ్యులను తొలగించడం

రేషన్ కార్డును సరెండర్ చేయటం

రేషన్ కార్డులో వివరాలను సరి చేసుకోవడం

అదేవిధంగా రేషన్ కార్డు జారీ ప్రక్రియ మరియు సవరింపుల ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గతంలో వీఆర్వోల లాగిన్ లో కూడా అప్రూవల్ పొందాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం వారి రికమండేషన్ మీదనే నేరుగా తహశీల్దార్ ఆమోదానికి  వెళ్ళటం జరుగుతుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ ఆప్షన్స్ అందుబాటులో ఉండగా, ఎక్కువమంది ముందు రేషన్ కార్డు దరఖాస్తుకి ముందు సవరింపులకు మొగ్గు చూపుతున్నారు. అంటే అనర్హత ఉన్న వారిని ముందు వారి రేషన్ కార్డు నుంచి తొలగించుటము లేకపోతే కొత్తవారిని అందులో జోడించడం వంటి అర్జీలు ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది.

సమయం 21  రోజులు, ఫీజు 24 రూపాయలు

రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పైన ఇవ్వబడిన ఏదైనా ప్రక్రియకు 21 రోజుల సమయం ఇవ్వడం జరుగుతుంది. కేవలం వివరాల సవరింపులు అయితే మరింత తొందరగా చేయడం జరుగుతుంది.

ప్రతి ప్రక్రియకు 24 రూపాయలు ఫీజు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా అంతకన్నా ఎక్కువ ఫీజు వసూలు చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1 0 6 4 కి కాల్ చేస్తే కంప్లైంట్ ఇవ్వవచ్చు.

రేషన్ కార్డుకు సంబంధించి ఇటీవల కల్పించిన సభ్యుల తొలగింపు మరియు వివరాల సవరింపులకు సంబంధించినటువంటి గైడ్లైన్స్ ని మరియు మాన్యువల్ ని డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Click here to Share

One response to “రేషన్ కార్డుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆప్షన్స్”

  1. Gokarla Satyanarayana Avatar
    Gokarla Satyanarayana

    గుడిమెట్ల నుండి తెలంగాణ బోనకల్లు విలేజ్ కి వచ్చాము రేషన్ కార్డు తొలగించాము అక్కడ రేషన్ కార్డు సరెండర్ చేద్దామనుకుంటే అవ్వట్లేదు ఆధార్ అతంటికేషన్ ఫెయిల్యూర్ అని వస్తుంది కావున ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా గ్రామ సచివాలయాన్ని కోరుతున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page