ఆంధ్ర ప్రదేశ్ లో రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల తొలగింపు, సభ్యుల వివరాలు అనగా జెండర్, అడ్రస్, రిలేషన్ వంటి డీటెయిల్స్ కరెక్షన్ కోసం ప్రభుత్వం ఇటీవల గ్రామ వార్డు సచివాలయాలలో ఆప్షన్ ని కల్పిస్తూ జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా వేరే రాష్ట్రానికి గాని, వేరే దేశానికి గాని వలస వెళ్లిన వారిని రేషన్ కార్డు నుంచి తొలగించే ప్రక్రియకు సంబంధించి మంచి స్పందన లభిస్తుంది.
ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఎవరు కూడా అధిక మొత్తంలో డబ్బులు వారికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా లంచం అడిగినా వెంటనే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
ఈ కరెక్షన్ ప్రాసెస్ లేదా సభ్యుల తొలగించే ప్రాసెస్ మొత్తానికి కూడా కేవలం 24 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సచివాలయంలో ఉండేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ ఈ ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ నుంచి ఎవరైనా అధిక మొత్తంలో లంచం కానీ డబ్బులు కానీ అడిగితే వెంటనే కింద తెలిపిన నెంబర్ కు ఫిర్యాదు చేయండి.
లంచం అడిగితే వెంటనే 1064 నెంబర్ కి డయల్ చేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ క్లిక్ చేయండి.
Leave a Reply