తెలంగాణ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తుంగతుర్తి వేదికగా 2.4 లక్షల కొత్త రేషన్ కార్డు ల పంపిణీ కార్యక్రమం జూలై 14 న ప్రారంభం కానుంది.
దీంతో 11.30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. గత ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 41 లక్షల మందికి రేషన్ పంపిణీ చేయడం జరిగింది.
జూలై 14న పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులతో కలిపి మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94.72 లక్షలకు చేరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ సందర్భంగా ప్రతి ఏటా 13 వేల కోట్లు ఖర్చు చేస్తూ 3.1 లక్షల మందికి కుటుంబానికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు.
తన హయాంలోనే 95 లక్షల మందికి ఆకలి తీర్చడం, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వడం సంతృప్తినిస్తుందని ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు.
Leave a Reply