జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

జులై 9 2025 – ఏపీ క్యాబినెట్ భేటీ ముఖ్యాంశాలు

వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.

జూలై 9 2025న క్యాబినెట్ ద్వారా ఆమోదించబడిన కీలక అంశాలు

  • > అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్‌ కేంద్రం ఏర్పాటు
  • > నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర..అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్‌ ఆమోదం
  • > హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్‌ ఆమోదం
  • > అమరావతిలో వరల్డ్‌ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర
  • > కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్‌ అనుమతి
  • > ఏపీ స్పేస్‌ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర
  • > గ్రీన్ టాక్స్ ను రూ.3వేల వరకు తగ్గింపు
  • > గత రబీ సీజన్లో కొనుగోలు చేసిన దాన్యం బకాయిలు 672 కోట్లు విడుదల

|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం  వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి.

You cannot copy content of this page