ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతోంది. పీఎఫ్ ఖాతాల్లో నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం చొప్పున వడ్డీని ఖాతాల్లో వేస్తోంది. ఈపీఎఫ్ఎ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ కొన్ని రోజుల క్రితం ప్రతిపాదించిన వడ్డీ రేటును ఇటీవల కేంద్రం నోటిఫై చేసింది. ఈ నేపథ్యంలో వడ్డీ ఎప్పుడు జమ అవుతుందా? అని చందాదారులు ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే కొందరికి వడ్డీ జమ అయినట్లు పాస్ బక్ లో అప్డేట్ కాగా.. కొందరికి మాత్రం వడ్డీ జమ కావాల్సి ఉంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఈ దిగువపద్ధతుల ద్వారా తెలుసుకోండి.
పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానం
యాప్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో జమ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు ఖాతాలో నిల్వల వివరాల కోసం ఉమాంగ్ యాప్‌ను సందర్శించొచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక యాప్‌లో ఈపీఎఫ్ఎ సర్వీసెస్ విభాగంలోకి వెళితే యూఏఎన్, ఓటీపీ ఎంటర్చేయాలి. ఆపై బ్యాలెన్స్, పాస్‌బుక్ వంటి వివరాలు కనిపిస్తాయి.
వెబ్సైట్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
ఈపీఎఫ్ పోర్టల్ www.epfindia.gov.in వెబ్సైట్లోకి వెళ్లి యూఏఎన్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెంబర్ పాస్‌బుక్ ను ఎంపిక చేసుకుని వివరాలు పొందొచ్చు.
మిస్డ్ కాల్ బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 99660 44425 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ నంబర్‌కు కాల్ చెయ్యగానే యగానే ఆటోమేటిక్‌గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది.కాసేపటి తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ ఎస్సెమ్మెస్రూపంలో వస్తుంది.
Sms ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునే విధానం
ఎస్సెమ్మెస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్ లింక్ అయిన మొబైల్ నుంచి 7738299899 నంబర్‌కు EPFOHO UAN’ అని మెసేజ్చేయడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ పొందొచ్చు.
Leave a Reply