విద్యా హక్కు చట్టం కింద ఒకటి నుంచి 8 తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల అనేది తమ ఇళ్లకు సమీపంలోనే ఉండడం తప్పనిసరి. అయితే ఒకవేళ పాఠశాల తమ ఇంటి నుంచి దూరంలో గాని ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం వారికి రవాణా భత్యం కల్పించాల్సి ఉంటుంది. అంటే నెలకు రవాణా ఛార్జీలు విద్యార్థులకు చెల్లించాలి.
ఏపీలో ఆ విద్యార్థులకు నెలకు 600 రవాణా భత్యం
రాష్ట్రవ్యాప్తంగా 1- 5 తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న పిల్లలకు పాఠశాల కనీసం ఒక కిలోమీటర్ లోపల ఉండాలి. ఒకవేళ అంతకుమించి ఉంటే ప్రతి నెల 600 రూపాయలు వారికి చెల్లించాల్సి ఉంటుంది. 6 నుంచి 8 తరగతి చదివే వారికి అయితే పాఠశాల మూడు కిలోమీటర్ల లోపు ఉండాలి. ఒకవేళ అంతకుమించి ఉంటే ప్రతినెల 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులను గుర్తించడం జరిగింది. ఇందులో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 12951 మంది ఉండగా గుంటూరు జిల్లాలో అత్యల్పంగా 437 మంది ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది.
మూడు నెలలకు ఒకసారి చెల్లింపు
ప్రతినెల 600 రూపాయల చొప్పున మూడు నెలలకు ఒకసారి 1800 రూపాయలు వీరి బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది. ఈ విధంగా సంవత్సరానికి ₹7,200 రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తాయి. ఇందులో కేంద్రం వాటా 60% రాష్ట్రం వాటా 40 శాతంగా ఉంటుంది.
తల్లిదండ్రులు సొంత వాహనాల పైన పిల్లలను దింపిన వర్తిస్తుంది
విద్యార్థులు తమ పాఠశాలకు వివిధ రవాణా మార్గాల్లో వెళ్లినా లేదా తల్లిదండ్రులు సొంతంగా బైక్ మీద వేద వాహనాల్లో దింపినా కూడా ఈ పథకం కింద సమగ్ర శిక్ష అభియాన్ వీరికి నగదు అందిస్తుంది.

మరింత సమాచారం కోసం సమగ్ర శిక్ష అభియాన్ ని సంప్రదించవచ్చు. Online link of Samagra Siksha Abhiyan
Leave a Reply