సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు సుపరిపాలనకు తొలి అడుగు అంటే ఏమిటి?
కూటమి ప్రభుత్వం రెండో దశలో అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు మరియు భవిష్యత్తులో చేయబోయే అన్ని కార్యక్రమాల గురించి ప్రజలకు సవివరంగా కరపత్రాలు ద్వారా వివరించే కార్యక్రమమే సుపరిపాలనకు తొలి అడుగు 4.1.
ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అనగా ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలు ప్రతి ఒక్క స్థాయి నేతలు ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందించి ప్రజల తో నేరుగా మాట్లాడుతారు. ఇందులో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా విరివిగా పాల్గొనడం జరుగుతుంది.
ప్రభుత్వం చేసిన మంచిని మరియు చేయబోతున్నటువంటి పనులను తప్పకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
దీనికి అదనంగా ప్రతిరోజు ఐదుగురు ఎమ్మెల్యేలు, ఐదుగురు ప్రజలతో మాట్లాడనున్నట్లు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.

ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా చెప్పవచ్చు
తెలుగుదేశం పార్టీ నేతలు లేదా కార్యకర్తలు తమ ఇంటికి వచ్చినప్పుడు ఏవైనా సమస్యలు ఉంటే ప్రజలు తప్పకుండా వారికి తెలియజేసే అవకాశం ఉంటుంది. అపరిష్కృత సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు లేదా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Leave a Reply