ఏపీ లో ఉచిత బస్సు పథకం(free bus travel) సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం
ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆగస్టు 15 నుంచి ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎందుకు అవసరమైన చర్యలు ముందుగానే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.

అన్ని రాష్ట్రాల ఉచిత బస్సు పథకాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రస్తుతం మహిళల కోసం పంజాబ్, తెలంగాణ, తమిళనాడు మరియు కర్ణాటకలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ రాష్ట్రాల కి సంబంధించినటువంటి ఉచిత బస్సు పథకాలన్నీ సమీక్షించి అధ్యయనం చేసి అన్నిటికంటే ఉత్తమ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఉచిత బస్సు ప్రయాణం పథకానికి 2536 కొత్త బస్సులు
రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు పథకం అమలు చేయాలంటే కొత్తగా 2536 బస్సులు అవసరమని ముఖ్యమంత్రి కి అధికారులు తెలిపారు. వీటిని కొనుగోలు చేయాలంటే 996 కోట్లు అవసరమవుతుందని వెల్లడించారు.
ఇకపై ఆర్టీసీలో విద్యుత్ వాహనాల కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించడం జరిగింది.
ఉచిత బస్సు పథకం అమలు చేసిన తర్వాత మహిళల నుంచి ప్రయాణాల సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో బస్సులో కొనుగోలు తో పాటు అన్ని సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం అంటే ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు మరియు మహిళలు అందరికీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించే పథకమే ఈ పథకం. వీరితోపాటు ట్రాన్స్జెండర్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది.
ఉచిత బస్సు ప్రయాణం ఏ బస్సుల్లో వర్తిస్తుంది?
ఈ పథకం ఆర్టిసి ద్వారా నడపబడుతున్నటువంటి పల్లె వెలుగు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ మరియు సిటీ మెట్రో బస్సుల్లో వర్తిస్తుంది.
ఈ పథకం ఏసి సర్వీసులు, స్లీపర్ సర్వీస్, సూపర్ లగ్జరీ బస్సుల్లో వర్తించదు.
Leave a Reply