తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

తెలంగాణలో రైతు భరోసా విడుదల, స్టేటస్ చెక్ చేయండి

తెలంగాణలో రైతులందరికీ గుడ్ న్యూస్. రైతు నేస్తం కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. దీంతో రైతు భరోసా జమ ప్రారంభమైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.

తొమ్మిది రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం

నేటి నుంచి రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగింది. ప్రత్యక్షంగా హాజరైన రైతులే కాకుండా రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న లక్షలాది మంది రైతుల సమక్షంలో 1 కోటి 49 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయంగా మీట నొక్కి 70 లక్షల మంది రైతులకు  రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు నుంచి వచ్చే 9 రోజుల్లోగా రైతులందరి ఖాతాల్లో నిధులు జమవుతాయని ప్రకటించారు.

తొలిరోజు 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఖాతాలో అమౌంట్ జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మొత్తం 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము ₹2349 కోట్లు జమ చేయడం జరిగింది.

ఈసారి ప్రభుత్వం ఎకరాలకు సంబంధించిన నిబంధనను తొలగించింది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతు భరోసా అందిస్తుంది.

CM with farmers releasing Rythu Bharosa amount

తెలంగాణ వరి ఉత్పత్తిలో నెంబర్ వన్:

వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. “రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం.. తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇంతకంటే ఇంకేం కావాలి” అని ఆయన భావోద్వేగంగా పలికారు.

CM With farmers

రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునే విధానం

రైతు భరోసా పథకం అమౌంట్ విడుదల స్టేటస్ చెక్ చెయ్యడానికి కింది లింకును క్లిక్ చేయండి

Click here to Share

You cannot copy content of this page