సచివాలయ ఉద్యోగుల బదిలీలు మరియు తొలగింపుల పై ఆ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పూర్తి క్లారిటీ ఇచ్చారు.
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులలో ఏ ఒక్కరిని కూడా తొలగించమని ఆయన హామీ ఇచ్చారు. రేష్నలైజేషన్ పై సదరు ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు లేవు.
రేషనలైజేషన్ పై మంత్రి కామెంట్స్..
- క్యాటగిరి ఏ లో పంచాయతీ కార్యదర్శి మరియు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు.
- మహిళా పోలీసులను మరొక కేటగిరీలో చేర్చనున్నట్లు తెలిపారు.
- ఒక్కో సచివాలయానికి 7 నుంచి 8 పోస్టులు ఉండేలా రేషనలైజేషన్ ఉంటుంది.
- ప్రస్తుతానికి ఎలాంటి బదిలీలు ఉండవు. ఏ ఉద్యోగిని తొలగించము.
- జిల్లా మరియు మండల స్థాయిలో అధికారులు సచివాలయాలను పర్యవేక్షణ చేస్తారు.
- ఉద్యోగుల సీనియారిటీని బట్టి పదోన్నతులపై ఓ ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
- ఉద్యోగులకు పని భారం తగ్గించడమే రేషనలైజేషన్ ఉద్దేశమని తెలిపారు.
Leave a Reply