ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను ₹50 పెంచింది. ఉజ్వల పథకం కింద వచ్చేరా సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. దీనితో పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించనుంది. రేపటి నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి.
ఇప్పటికే నిత్యవసరాలు ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు మరో భారం కేంద్ర ప్రభుత్వం అందించింది. వంట గ్యాస్ ధరను పెంచుతూ కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరి ప్రకటించారు.
ధరల పెరుగుదల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి మాట్లాడుతూ.. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 500 నుంచి రూ. 550కు పెరిగింది. ఈ ధర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది. ఇతరులు రూ. 853 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు వినియోగదారులపై భారం మోపడం లేదని కూడా స్పష్టం చేశారు. సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొన్న 43,000 కోట్ల నష్టాన్ని భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు.
Leave a Reply