ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా జరుగుతున్న కసరత్తు మేరకు తాజాగా ఇంటర్మీడియట్ విద్యలో పలు కీలక మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఏప్రిల్ నుంచే అడ్మిషన్లు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో 2025-26 విద్య సంవత్సరం నుంచి జూన్ 1వ తేదికి బదులుగా ఏప్రిల్ 1వ తేదీ నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభం కానున్నాయి. 2026లో పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరిలో, ప్రధమ సంవత్సరం అడ్మిషన్లు ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇంటర్ లో సంస్కరణలు
ఇంటర్ మ్యాథ్స్ ఎ-బి ఒకే సబ్జెక్ట్, బోటనీ, జువాలజీ ఒకే సబ్జెక్ట్ పరిగణించాలని నిర్ణయించారు.
ఇకపై ఏటా ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జూనియర్ కాలేజిల్లో ఎం బైపీసీ కోర్సుకు అనుమతిచ్చారు.
ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులను తయారు చేసేందుకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి క్యాలెండర్ లో మార్పులు చేశారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి.. జూన్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ కళాశాలలు ప్రారంభమవుతాయని లోకేశ్ తెలిపారు.
జూన్ 1కి బదులుగా ఏప్రిల్ 7 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు జరగనున్నాయని చెప్పారు.
2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చి 2026కి బదులుగా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహించనున్నటు వెలడించారు.
సబ్జెక్టులపై నిర్ణయం
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రద్దు చేయాలని గతంలో వచ్చిన ప్రతిపాద నను ఇంటర్మీడియట్ విద్యామండలి నిలిపివేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీ డియట్ ప్రథమ సంవత్సరంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్‌ను అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆరు సబ్జెక్టులతో M.బైపీసీ కోర్సు చదువుకునే అవకాశం కల్పించారు. మార్చిన సిలబస్ ప్రకారం కొత్త పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇస్తారు. గ్రూపులో ఐదు సబ్జెక్టులు ఉంటాయి. రెండు భాష సబ్జెక్టుల్లో ఆంగ్లం తప్పని సరిగా చదవాల్సి ఉంటుంది. రెండో భాష సబ్జెక్టు ఐచ్చికంగా ఎంపిక చేసుకోవచ్చు. అదే విధంగా ఎంపీసీ విద్యార్థి రెండో భాష తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ స్థానంలో జీవశాస్త్రం తీసుకుంటే ఎం.బైపీసీ చదవొచ్చు. లేదంటే నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.
పేపర్లలో మార్పులు
ఇంటర్ విద్యార్ధులకు ప్రస్తుతం గణితంలో ఏ, బీగా పేపర్లు 150 మార్కులకు ఉండగా వచ్చే ఏడాది మొదటి సంవత్సరం విద్యార్థులకు 100 మార్కులకే పేపర్ ఉంటుంది. అదే విధంగా భౌతిక, రసాయనశాస్త్రాలు ప్రస్తుతం 60 మార్కులకు ఉండగా ఇది 85మార్కులకు పెరగను న్నాయి. రెండో ఏడాదిలో 30మార్కులకు ప్రాక్టీకల్స్ ఉంటాయి. వృక్ష, జంతు శాస్త్రం కలిపి జీవశాస్త్రంగా ఒకే సబ్జెక్టుగా ఉంటాయి. ఇది 85 మార్కులకు ఉంటుంది. ఇందులో 43మార్కులు వృక్షశాస్త్రం, 42 మార్కులు జంతుశాస్త్రం ఉంటుంది. మిగతా 15 మార్కులకు ప్రాక్టీకల్స్ ఉంటాయి. భాష సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయి. నీట్, జేఈఈ, ఈఏపీసెట్ లాంటి పోటీ పరీక్షల మెటీరియల్‌ను బోర్డు పోర్టల్‌లో ఉంచుతారు. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు కోచింగ్ తోపాటు మెటీరియల్ ఉచితంగా ఇస్తారు.
ఏప్రిల్ నుంచే కళాశాలలు
2025-26 విద్యా సంవత్సరం నుంచి జూన్ ఒకటో తేదీకి బదులు ఏప్రిల్ 1 నుంచే జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఏప్రిల్ 7నుంచి మొదలవుతాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026లో కాకుండా ఫిబ్రవరి చివరి వారం నుంచే నిర్వహిస్తారు. వృత్తి విద్యా కోర్సుల్లో డ్యూయల్ సర్టిఫికెట్ విధానం ఉంటుంది. ఒకటి జాతీయ నైపుణ్య కౌన్సిల్ సర్టిఫికెట్‌తోపాటు ఇంటర్మీడియట్ బోర్డు మరో సర్టిఫికెట్ ఇస్తుంది. దీంతో పాటుగా 1973 నుంచి 2003 వరకు ఉన్న సర్టిఫికెట్లను డిజిటలైజేషన్ చేయాలని తాజా సమీక్ష లో నిర్ణయం తీసుకున్నారు.
Leave a Reply