ఏపీలో సంక్షేమ పథకాలు మరియు పౌర సేవలు అందాలంటే హౌస్ హోల్డ్ (House hold) డేటా లో నమోదు తప్పనిసరి. ఈ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయ పరిధిలో నమోదు చేయడం జరుగుతుంది. పౌర సేవలు మరియు సంక్షేమ పథకాల కు ఈ డేటా ను ప్రభుత్వం వినియోగిస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు తప్పనిసరిగా మీ సచివాలయంలో మీ కుటుంబ వివరాలను తెలియపరచాల్సి ఉంటుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖలు గ్రామ వార్డు సచివాలయాలు మరియు RTGS వద్ద ఉండే హౌస్ హోల్డ్ డేటా బేస్ కి అనుసంధానం చేసుకోవాలని సూచించింది. తద్వారా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా పౌర సేవలు అయినా RTGS మరియు గ్రామ వార్డు సచివలయాల దగ్గర ఉండే ఈ డేటాతో సరిపోల్చుకొని అమలు చేయడం జరుగుతుంది.
హౌస్ హోల్డ్ డేటా ఇలా నమోదు చేసుకోవాలి! (How to register in House hold data)
మీ కుటుంబ వివరాలను హౌస్ హోల్డ్ డేటాలో రిజిస్టర్ చేసేందుకు గాను మీ గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించండి.
ఇందులో మీ కుటుంబానికి సంబంధించినటువంటి అందరి వివరాలు ఒకే చోట మ్యాప్ చేయబడతాయి. గత ప్రభుత్వ హయాంలో మీ డేటా మ్యాప్ అయినప్పటికీ కూడా ఒకసారి సచివాలయానికి వెళ్లి మీ లేటెస్ట్ వివరాలను అందించండి.
మీరు అందించే కుటుంబ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ వివరాలను పూర్తి గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Department of GSWS – Mandatory for all citizens of Andhra Pradesh to include in the household database in order to access / avail any citizen services, schemes or benefits of the Government and also the data from the RTGS/GSWS household database is validate for processing any application or delivering any service, scheme or benefit by the Government – Orders – lssued.Download here
Leave a Reply