రాష్ట్రవ్యాప్తంగా 1.02 లక్షల మంది మహిళలకు కుట్టు పై ఉచితంగా శిక్షణతోపాటు మిషన్లను అందించనున్నట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్ శాఖ మంత్రి సవిత వెల్లడించారు.
బీసీ, కమ్మ, కాపు, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళల ఉపాధి కల్పనకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ నెల 8 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
లబ్దిదారుల వీలుకు అనుగుణంగా 45 రోజుల నుంచి 90 రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. తొలి విడతగా 46,044 మంది బీసీలకు, 56,788 మంది ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు కుట్టుమిషన్లు అందిస్తామని వివరించారు.
ఇందుకోసం ప్రభుత్వం రూ.255 కోట్లు వెచ్చిస్తోందని చెప్పారు.
8 responses to “మహిళలకు గుడ్ న్యూస్…ఉచితంగా కుట్టు మెషిన్లు”
Naku kuttu mision kavali sir
మరి ఎస్సి, ఎస్టీ మహిళలకు ఆ పధకాలు రావా సీఎం సారు
We want tailaring mission
Good
Not received
Sir Apply ki link papichara
Okay good thank you this offer
Good idea I appreciate this offer