ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది. దీని ద్వారా రైతులకు ప్రతీ సంవత్సరం పెట్టుబడి సాయం కింద రూ.6,000 చొప్పున ఇస్తోంది. ఇలా 3 విడతల్లో ఈ డబ్బును రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. తాజాగా 19వ విడత డబ్బును ఫిబ్రవరి 24న జమ చేసింది. దాదాపు 9.7 కోట్ల మంది రైతుల అకౌంట్లలో రూ.22 వేల కోట్లను విడుదల చేసారు.
ఇప్పటి వరకూ 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు
పీఎం కిసాన్ పథకాన్ని కేంద్రం 24, ఫిబ్రవరి 2019లో ప్రారంభించింది. ఇప్పటివరకూ 18 విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు ఇచ్చింది. ఐతే.. ఈ డబ్బును పొందాలంటే.. తప్పనిసరిగా రైతులు తమ బ్యాంక్ అకౌంట్లలో ఈ-కేవైసీ పూర్తి చెయ్యాలి. దీన్నే ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అంటారు. అంటే.. అకౌంట్ ఓపెన్ చేశాక.. బ్యాంక్ వారు అడిగే కొన్ని వివరాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్‌కి మొబైల్ నంబర్, ఆధార్ లింక్ చేసి ఉండాలి. అలాగే అడ్రెస్, గుర్తింపు కార్డుల వెరిఫికేషన్ పూర్త చేసి ఉండాలి. ఈ-కేవైసీ సంపూర్ణంగా చేసిన వారికే మనీ జమ అవుతుంది.
PM కిసాన్ లబ్ధిదారుని స్టేటస్ 2025 మరియు PM కిసాన్ పెమెంట్ స్టేటస్ ను ఇలా చెక్ చేయండి
క్రింద ఉన్న స్టెప్స్ ను అనుసరించి ఆధార్ కార్డ్ లేదా మొబైల్ నంబర్ తో సులభంగా మీ PM కిసాన్ స్టేటస్ ను చెక్ చేయండి
Step 1: దిగువన ఇవ్వబడిన అధికారిక PM-KISAN వెబ్‌సైట్‌కి వెళ్లండి. అందులో know your status లింక్ పై క్లిక్ చేయండి లేదా కింద ఇవ్వబడిన Know your status డైరెక్ట్ లింక్ పైన క్లిక్ చేయండి.


Step 2: పైన ఇవ్వబడిన know your status లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత కింది విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. Registration number తెలిస్తే ఎంటర్ చేయండి. తెలియకపోతే కింద ఎలా తెలుసుకోవాలో స్టెప్స్ ఇవ్వబడ్డాయి చెక్ చేయండి.

Step 2.1: మీకు రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తులేకపోతే “know your registration number”పై క్లిక్ చేయండి

Step 2.2 : మీరు మొబైల్ నెంబర్ లేదా మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పొందవచ్చు .. ఏదో ఒకటి ఎంచుకొని ‘Get Mobile OTP’ పైన క్లిక్ చేయండి.
మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది.

Step 2.3: మీరు మీ మొబైల్ లేదా ఆధార్‌ని నమోదు చేసిన తర్వాత మీరు వివరాలను క్రింది విధంగా చూడవచ్చు, అంటే మీ రిజిస్ట్రేషన్ నంబర్ క్రింది విధంగా చూపబడుతుంది.

Step 3: మీరు రిజిస్ట్రేషన్ నంబర్ ను పొందిన తర్వాత, దిగువన ఉన్న విధంగానే ఎంటర్ చేసి, ఆపై captcha కోడ్ ను నమోదు చేయండి.

Step 4: వివరాలు ఎంటర్ చేసిన తర్వాత “Get OTP” పై క్లిక్ చేయండి. మీ మొబైల్ కి వచ్చిన ఆరు అంకెల OTP ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి.

Step 5: మీ PM-KISAN స్టేటస్ మరియు పేమెంట్ వివరాలు దిగువన స్క్రీన్ పై చూపించబడతాయి. మీరు డ్రాప్ డౌన్ నుండి మీ మునుపటి మరియు ప్రస్తుత installment ను సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా పేమెంట్ అయిందా లేదా స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.


ఇది FTO ప్రాసెస్ చేయబడిందని చూపిస్తే, PM నిధులను విడుదల చేసిన తర్వాత కొద్ది రోజులకు అమౌంట్ క్రెడిట్ చేయబడుతుంది. మీకు చెల్లింపు అయిన తర్వాత అక్కడ మీ బ్యాంక్ మరియు ఖాతా వివరాలు చూపిస్తాయి.
గమనిక: pm కిసాన్ నిధులను పొందాలంటే EKYC తప్పనిసరి. పైన ఇవ్వబడిన ప్రాసెస్ అనుసరించి మీరు మీ ekyc స్టేటస్ ను కూడా చెక్ చేయవచ్చు. తదనుగుణంగా ఆన్‌లైన్‌లో లేదా సమీపంలోని CSC కేంద్రాల ద్వారా kycని పూర్తి చేయవచ్చు. ekyc ఆన్‌లైన్‌ని పూర్తి చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Leave a Reply