తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
గతంలో ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకున్న వారికి, మీ సేవా, గ్రామ సభలు మరియు జనవరి 26 తర్వాత నిర్వహించిన గ్రామ వార్డు సభల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవటం గమనార్హం. అయితే ఇటువంటి వారిని పటిష్టంగా తనిఖీ చేసి అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలు పదేపదే దరఖాస్తు చేయకుండా అవగాహన కల్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలలో పంపిణీ చేయడం కుదరదు కాబట్టి ఆ జిల్లాలను ప్రస్తుతానికి పక్కనపెట్టి మిగిలిన జిల్లాలలో రేషన్ కార్డుల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Leave a Reply