ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అందించింది. ప్రతినెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు తీసుకునేందుకు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారు సొంత ఊరికి వెళ్లాలంటే అష్ట కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటివారు ఇకపై పెన్షన్ బదిలీ చేయించుకుంటే వారి ఉన్న స్థలంలోని పెన్షన్ డబ్బులు తీసుకునే వీలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే మూడు నెలలకు ఒకసారి తీసుకునే వెసులుబాటు కూడా కల్పించడంతో ఇతర ప్రాంతాలలో నివసించే వారికి ఉపశమనం దక్కింది. ప్రస్తుతం బదిలీ చేసుకునే అవకాశం కూడా కల్పించడంతో దూర ప్రాంతాల్లో నివసించే వారి కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.
పెన్షన్ బదిలీ ఎక్కడ అప్లై చేసుకోవాలి?
రాష్ట్రంలో ఎవరైనా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ బదిలీ చేయించుకోవాలనుకుంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పెన్షన్ వెబ్సైట్లో సచివాలయ ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది.
పెన్షన్ బదిలీకి కావలసినవి ఏమిటి
టెన్షన్ బదిలీ చేయించుకోవాలనుకున్నవారు పెన్షన్ ఐడి మరియు వారు ఏ ప్రాంతానికి పెన్షన్ను బదిలీ చేయించుకోవాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ను సచివాలయ ఉద్యోగులకు ఇవ్వాలి. వీటితోపాటు లబ్ధిదారుడు నివాసం ఉంటున్న జిల్లా మండలం మరియు సచివాలయం పేరును కూడా నమోదు చేయించాలి.
పెన్షన్ బదిలీ ఆప్షన్ ఎప్పటి వరకు ఉంటుంది
ఈ టెన్షన్ బదిలీ ఆప్షన్ ప్రతినెలా ఉండే అవకాశం ఉంది పెన్షన్ బదిలీ చేయాలనుకుంటున్నా వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
AP వికలాంగుల పెన్షన్ ధృవీకరణ 2025
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరిలో అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. అనర్హులైన వారికి ముందుగానే నోటీసులు ఇచ్చి వైద్య నిపుణుల చేత పరీక్షలు చేయిస్తున్నారు. తనిఖీ తర్వాత అనర్హులుగా గుర్తించబడితే వారి పెన్షన్ రద్దు చేయడం జరుగుతుంది. త్వరలోనే అనర్హుల జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే అవకాశం కలదు.
Leave a Reply