“సొంత స్థలము కలిగి ఉండి, గృహము కట్టుకొనుటకు సిద్దముగా ఉండి అర్హత కలిగిన కుటుంబాల వారు ఈ క్రింద తెలిపిన పత్రముల జిరాక్స్ కాపీలు మరియు ”4బి” అప్లికేషన్ ఫామ్ ను గ్రామ/ వార్డు సచివాలయ కార్యాలయము నందు వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ / వార్డ్ ప్లానింగ్ సెక్రటరీల/ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ను సంప్రదించి 30.01.2025 లోపు దరఖాస్తుచేసుకొనవచ్చు.
అర్జీదారులు డిమాండ్ సర్వే మరియు PMAY 2.0 వెబ్సైట్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది.
సూచనలు :
- అర్జీదారురాలు మరియు వారి భర్తతో కలిసి ఉన్న ఫోటో విధిగా అర్జీకి అతికించవలెను.
- ఆదాయ ధృవీకరణ పత్రము
- రేషన్ కార్డు, కరెంట్ బిల్,హౌస్ టాక్స్ బిల్ కాపీ.
- ఓటరు ఐ.డి. కార్డ్
- కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డుల నకళ్ళు .
- కుల ధృవీకరణ పత్రం
- వ్యక్తిగత బ్యాంకు ఖాతా మొదటి పేజి (ఆధార్ అనుసంధానం అయివుండాలి)
- ఇంటిపట్టా లేదా సొంత ఇంటి స్థల డాక్యుమెంటు లేదా పొసెషన్ సర్టిఫికేట్,.
- అంగవైకల్యము ఉన్నచో సంబంధిత సర్టిఫికేట్ మొదలగునవి జిరాక్స్ కాపీలు అర్జీకి జతపరచవలెను. జిరాక్స్ కాపీల నందు అర్జీ దారుని సంతకం చేయవలెను.
IMP: 1. OTP కొరకు ఫోన్ నెంబర్ ఆధార్ కార్డుతో లింకు అయ్యి వినియోగం లో ఉండి వుండాలి
అర్హులైన వారందరూ ఈ అవకాశమును సద్వినియోగ పరుచుకోవలెనని తెలియజేయడమైనది.
PMAY 2.0 – Eligibility Criteria
- గతంలో ఎప్పుడు ఇల్లు మీ పేరు మీద శాంక్షన్ అయ్యి ఉండరాదు.
- పక్క ఇల్లు కలిగిన హౌస్ టాక్స్ మీ పేరు పై ఉండ రాదు .
- ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు .
- 4 చక్రాల వాహనం ఉండరాదు .
- ఇంట్లో ఎవరు ఆదాయపు పన్ను కట్టరాదు.
- భూమి ఉంటె, కనీసం 340 చదరపు అడుగుల భూమి ఉండాలి .
- అప్లికేషన్ చేస్తున్న వారు ఉన్న రైస్ కార్డు / రేషన్ కార్డులో ఉన్న వారిలో ఎవరికీ గతంలో హౌస్ శాంక్షన్ అయ్యి ఉండరాదు
PMAY 2.0 – Documents Required
- ఆధార్ కార్డుల జెరాక్స్ [ భార్య + భర్త ] సంతకాలతో 2. రేషన్ కార్డు / బియ్యం కార్డు జెరాక్స్
- బ్యాంకు అకౌంట్ జెరాక్స్ [ భార్య + భర్త ] 4. జాబ్ కార్డు జెరాక్స్
- దరఖాస్తు దారుని పాస్ పోర్ట్ సైజు ఫోటో [2]
- పట్టా లేదా పొజిషన్ సర్టిఫికెట్ జెరాక్స్
- క్యాస్ట్ సర్టిఫికెట్
- ఇన్కమ్ సర్టిఫికెట్
- పనిచేస్తున్న మొబైల్ నెంబర్
Leave a Reply