Aadhar Update – ఇక పై అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ లో అడ్రస్ అప్డేట్. గుడ్ న్యూస్ తెలిపిన UIDAI

,
Aadhar Update – ఇక పై అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ లో అడ్రస్ అప్డేట్. గుడ్ న్యూస్ తెలిపిన UIDAI

ఆధార్ కార్డు లో ఇక పై అడ్రస్ మార్చుకోవడం మరింత సులభం.. ఇందుకు సంబంధించి UIDAI కీలక ప్రకటన..

మీరు ఉద్యోగరీత్యా లేదా ఇతర కారణాలతో ఇతర ప్రాంతాలకు తరచుగా బదిలీ అవుతున్నచో , లేదా ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతంలో ఉంటున్నచో ఇకపై మరింత త్వరగా , సులువుగా ఆధార్ కార్డు లో అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తుదారుడు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న డాక్యుమెంట్లను ధ్రువీకరణ ప్రూఫ్ గా సమర్పించవచ్చు.

భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్ చేసేందుకు ప్రతి ఒక్కరు తమ పేరు మీద ఉన్న ధ్రువీకరణ పత్రం సమర్పించాలనే నిబంధన ఉంది. ఒకవేళ అడ్రస్ ధ్రువీకరణ పత్రం లేకుంటే అడ్రస్‌ అప్డేట్ చేయడం సాధ్య పడదు. ఇకపై ఈ ప్రాసెస్ సులభతరం అయింది. ఆధార్‌లో అడ్రస్‌ మార్చుకునేందుకు దరఖాస్తుదారు కుటుంబ పెద్ద పేరుతో ఉన్న రేషన్‌కార్డ్‌, వివాహ ధ్రువీకరణపత్రం, పాస్‌పోర్ట్ వంటివి సమర్పించవచ్చు. ఒకవేళ దరఖాస్తుదారు అడ్రస్‌ అప్‌డేట్‌ కోసం సమర్పించిన ధ్రువీకరణ పత్రం సరైంది కాకుంటే, ఇతర డాకుమెంట్స్ తో పాటు ఉడాయ్‌ సూచించిన విధంగా కుటుంబ పెద్ద స్వీయ ధ్రువీకరణ (Self-declaration) సమర్పించాలి. దీనిని పరిగణలోకి తీసుకుని దరఖాస్తుదారుడి ఆధార్‌లో అడ్రస్‌ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. ఈ పద్దతి ద్వారా కుటుంబసభ్యులు అనగా (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) సులువుగా తమ అడ్రస్‌ను అప్డేట్ చేసుకోగలరు. 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా దీనికి అర్హులు అని ఉడాయ్‌ తెలిపింది.

ఆన్లైన్ లో ఎలా అప్డేట్ చేసుకోవాలి ?

  1. ఈ సేవల కోసం దరఖాస్తుదారుడు మై ఆధార్‌ (My Aadhaar) పోర్టల్‌లోకి వెళ్లి ₹ 50 రుసుము చెల్లించి, తమ కుటుంబ పెద్ద ఆధార్‌ నంబర్‌ టైప్‌ చేయాలి. తర్వాత ఒక సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబర్‌ (SRN) జారీ అవుతుంది.
  2. దరఖాస్తుదారుడు అడ్రస్‌ అప్‌డేట్‌ కోరినట్లు కుటుంబ పెద్ద ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌కు ఎస్సెమ్మెస్‌ ద్వారా అభ్యర్థన పంపబడుతుంది.
  3. ఆ అభ్యర్థనను కుటుంబ పెద్ద ధ్రువీకరించాలి. ఈ ప్రక్రియ ఎస్‌ఆర్‌ఎన్‌ జారీ అయిన 30 రోజుల వ్యవధిలోపు పూర్తి కావాలి.
  4. ఒకవేళ కుటుంబ పెద్ద నిర్ణీత వ్యవధిలోపు అడ్రస్‌ అప్‌డేట్‌ కోసం పంపిన అభ్యర్థనను తిరస్కరించినా, ధ్రువీకరించకున్నా ఎస్‌ఆర్‌ఎన్‌ ముగిసిపోతుంది. దీంతో యూజర్‌ కొత్తగా మరో ఎస్‌ఆర్‌ఎన్‌ను ప్రారంభించాలి.
  5. SRN ధ్రువీకరించిన తరువాత సంబంధిత డాకుమెంట్స్ సబ్మిట్ చేసి అప్డేట్ రిక్వెస్ట్ పెట్టవచ్చు.
Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page