ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. రిటైర్ అయ్యాక అదిరిపోయే బెనిఫిట్, ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక రిటైర్‌ అయిన ఉద్యోగులు, భవిష్యత్‌లో రిటైర్ కాబోయే వారికి తీపికబురు చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగులు ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యసేవలు పొందే అవకాశం కల్పించింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో పీడీటీ (ప్రజారవాణాశాఖ) ఉద్యోగులుగా విలీనం చేసిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో రిటైర్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగికి, భాగస్వామికి రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ మెడికల్‌ ఫెసిలిటీస్‌ స్కీమ్‌ కింద వైద్యసేవలు అందించేవారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో.. ఆ తర్వాత నుంచి రిటైర్‌ అయ్యే వారికి ఆర్టీసీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించడం లేదు. దీంతో ప్రభుత్వం తాజాగా రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆర్టీసీ డిస్పెన్సరీలు, ఆసుపత్రుల్లోని వైద్యంతోపాటుగా ఈహెచ్‌ఎస్‌ ద్వారా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అంతేకాదు ఒకవేళ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఎవరైనా.. అత్యవసరంగా ఏదైనా ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుంటే.. వారికి రీయింబర్స్‌మెంట్‌ సదుపాయం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం.

ఆ ఉద్యోగులందరికి మినిమం టైం స్కేల్‌

రాష్ట్రవ్యాప్తంగా యూనివర్శిటీలు, సొసైటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరికి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 మధ్య ప్రభుత్వ విభాగాలు, యూవర్సిటీలు, సొసైటీల్లో పని చేస్తున్న వారికి మినిమం టైం స్కేల్‌ అమలు చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల ఇవ్వగా.. గత ప్రభుత్వం యూనివర్శిటీలు, సొసైటీలకు అమలు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం వాటికి కూడా అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతి పొందిన పోస్టుల్లో పని చేస్తున్న వారికి ఈ టైం స్కేల్ వర్తిస్తుంది. ప్రసూతి సెలవులు, ఎక్స్‌గ్రేషియా సదుపాయాన్నీ ప్రభుత్వం కల్పించింది. ప్రసూతి సెలవులు 180 రోజులు..ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.5 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారు.

Click here to Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page