ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను ఒకటైన రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగమైన ఈ హామీకి సంబంధించి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది.
19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1500 అందించే ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో రూ.3341.82 కోట్లు కేటాయించింది.
జెండర్ బడ్జెట్లో ఈ నిధుల్ని ప్రభుత్వం చూపించగా.. త్వరలోనే పథకం విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.
ఉచిత బస్సు ప్రయాణం
కేవశ్ బడ్జెట్ ప్రసంగంలో ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావన చేసారు. ప్రభుత్వం హామీలకు కట్టుబడి ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే చెప్పినట్లుగా అంతకు ముందు రెండు నెలలో కలిపి నెలకు రూ 4 వేల నుంచి రూ 15 వేల వరకు పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్దిక సంవత్సరంలోనే ప్రారంభించేలా పయ్యావుల తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర పథకాల ప్రస్తావన చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీల గురించి వివరించారు.
అయితే, మహిళలకు ప్రతీ నెల రూ 1500 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించే ఎక్కువగా వివరించారు. మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకం గురించి కేశవ్ గుర్తు చేసారు. అదే విధంగా అమ్మకు వందనం పథకం సైతం వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం నిధుల ప్రస్తావన కేశవ్ తన ప్రసంగంలో చేయకపోవటంతో.. రానున్న నాలుగు నెలల కాలంలో ఈ పథకం అమలయ్యే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
Leave a Reply