దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుపు పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పిఎం ఇంటెన్షిప్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది 66,000 చొప్పున ఐదేళ్లపాటు కోటి మంది విద్యార్థులకు ఆర్థికంగా లబ్ది చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. 2024-25 సంవత్సరంలో పైలెట్ పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
ఈ పథకం ద్వారా ఏడాదికి 60 వేల ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు మరియు ఇందుకు మరో 6000 అదనంగా గ్రాంట్ రూపంలో అందిస్తారు. ఇందుకు సంబంధించిన వెబ్సైట్ను అక్టోబర్ 12 తారీఖున ప్రారంభించారు. అర్హులైన వారు అక్టోబర్ 25 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వికసిత్ భారత్ పథకం యొక్క లక్ష్యం
పరిశ్రమల అవసరాలు కనుగుణంగా యువతలో సరైన నైపుణ్యాలు మెరుగుపరచడం కోసం డిగ్రీ చేసిన వారికి ఆర్థిక భరోసా అందించడానికి ఈ పథకం రూపకల్పన చేయడం జరిగింది.
కావలసిన డాక్యుమెంట్స్
దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింద ఇచ్చిన డాక్యుమెంట్లు అవసరం
- ఆధార్ కార్డు
- పాస్పోర్ట్ సైజ్ ఫోటో
- విద్యార్హత పత్రాలు
ఎవరెవరు అర్హులు
- టెన్త్, ఇంటర్, ఐటిఐ, పాలిటెక్నిక్, బీకాం, బీసీఏ, బిబిఏ, బి ఫార్మా చదివిన విద్యార్థులు ఈ పథకానికి అర్హులు
- 21 నుండి 24 సంవత్సరాల మధ్య కలిగిన విద్యార్థులు అర్హులు
ఎవరు అనర్హులు
- ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ఈ పథకానికి అనర్హులు
- కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా అనర్హులు
- ఫుల్ టైం కోర్స్ చేస్తున్నవారు అనర్హులు
- ఐఐటి, ఐఐఎం, నేషనల్ లా విశ్వవిద్యాలయం, ఎన్ఐటి, ఐ ఐ ఐ టి, సిఎ, ఎంబిబిఎస్, సిఎస్ డిగ్రీలు పొందినవారు అనర్హులు
- వృత్తిపరమైన డిగ్రీలు చేస్తున్న వారు కూడా అనర్హులు
- స్కిల్ అప్రెంటి షిప్ చేసిన వారు కూడా అనర్హులు.
దరఖాస్తు చేసుకోవడం ఎలా
ఈ పథకానికి అర్హులైన వారు ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు
మొదటగా పీఎం ఇంటెన్షిప్ అధికారిక సందర్శించండి
తరువాత “Youth Registration” పైన క్లిక్ చెయ్యాలి
తరువాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చెయ్యండి
మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. తరువాత Consentపైన క్లిక్ చెయ్యండి
మీ మొబైల్ మెసేజ్ రూపం లో పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ ని కరెంట్ పాస్వర్డ్ లో ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ని సెట్ చేసుకోండి
తరువాత మీ ఆధార్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చెయ్యండి. తరువాత మీ స్కిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చెయ్యండి.
సెలెక్ట్ అయిన వారికి గరిష్టంగా మూడు సంస్థలలో ఎంపిక ఉంటుంది.
ప్రముఖ సాఫ్ట్వేర్, బహుళ జాతి, గ్యాస్, చమురు, ఇంధన రంగం, టూర్స్ అండ్ ట్రావెల్స్, ఆతిధ్య రంగాలలో అవకాశాలు కల్పిస్తారు. ఎంపికైన వారికి సంవత్సరం ఇంటెన్షిప్ అందిస్తారు. సగం కాలం పరిశ్రమల్లో వాస్తవ పని అనుభవం లేదా ఉద్యోగ వాతావరణంలో గడపాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
- అక్టోబర్ 12 నుంచి 25 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది
- అక్టోబర్ 26న షార్ట్ లిస్ట్ చేస్తారు
- అక్టోబర్ 27 నుంచి నవంబర్ 7 వరకు అభ్యర్థులకు ఇంటర్న్షిప్ చేయడానికి సంస్థను కేటాయిస్తారు
- నవంబర్లో ఆఫర్ లెటర్ లో అందించి, డిసెంబర్లో సంబంధిత సంస్థల్లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ విధానం అమల్లో ఉంటుంది