మనదేశంలో అత్యంత సంపన్నుడైనటువంటి ముఖేష్ అంబానీ కి సంబంధించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదనే చెప్పవచ్చు.
దేశంలోనే అత్యంత దిగ్గజ మరియు విలువైన కంపెనీలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఫార్చ్యూన్ 500 జాబితాలో చోటు సంపాదించుకున్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ షేర్ హోల్డర్స్ అనగా స్టాక్ మార్కెట్లో వాటా దారులకు గుడ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే ఎవరి దగ్గర అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ RIL కు సంబంధించినటువంటి షేర్లు ఉంటాయో, వారికి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను అందించనుంది.
అంటే మీ దగ్గర ఉన్నటువంటి షేర్లు రెట్టింపు అవుతాయి. ఇందుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఆగస్టు 29న వెల్లడించినటువంటి కంపెనీ ప్రస్తుతం అక్టోబర్ 28 ని అందుకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ రికార్డ్ డేట్ గా ప్రకటించింది.
ఉదాహరణకు మీ దగ్గర అక్టోబర్ 28 నాటికి 1000 రిలయన్స్ ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి షేర్లు ఉంటే అవి రెట్టింపు అయి 2,000 షేర్లు అవుతాయి. అయితే వాటి విలువ అంతే ఉంటుంది. అమౌంట్ లో వ్యత్యాసం అయితే రాదు కానీ తక్కువ ధరకే షేర్ లభించనుండడటం తో ఇందులో లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఎక్కువ ఎక్కువమంది దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
గతంలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ పలుమార్లు బోనస్ షేర్లను ప్రకటించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించిన పూర్ణ షేర్లకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు కాఫీ కింద చెక్ చేయవచ్చు.
గమనిక: ఈ సంవత్సరం కేవలం మీ అవగాహనకు మాత్రమే.. షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించినటువంటి వివరాలను తప్పక తెలుసుకోవాలి. మరిన్ని వివరాల కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి పూర్తిగా వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. మీరు తీసుకునే నిర్ణయానికి మాకు ఎటువంటి సంబంధం ఉండదు.