AP Cabinet October 2024: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు… చెత్త పన్ను రద్దు పై క్యాబినెట్ ఆమోదం

AP Cabinet October 2024: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు… చెత్త పన్ను రద్దు పై క్యాబినెట్ ఆమోదం

ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చించి పది అంశాలకు ఆమోదం ముద్ర వేసింది. ఇందులో ముఖ్యంగా ఇటీవలేము ముఖ్యమంత్రి ప్రకటించిన చెత్త పన్ను రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • ఏపీ క్లీన్ ఎనర్జీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  • 2024- 29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది.
  • 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా పాలసీ.
  • ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పై రాష్ట్ర మంత్రివర్గంలో చర్చ.
  • నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • 2030 నాటికి ఇంటింటికీ పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకువచ్చింది.
  • ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీపై చర్చ.
  • మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూకేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం.
  • డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీల నియామకంపై చర్చ.
  • ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ నియామకంపైనా చర్చ.
  • అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం.
  • చెత్తపన్ను రద్దుపైనా క్యాబినెట్ తీర్మానం.
  • దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు.

You cannot copy content of this page