వాలంటీర్లపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

వాలంటీర్లపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సభలో భాగంగా ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు.

కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కర్నూల్ నుంచి బళ్లారి కి జాతీయ రహదారులు తీసుకొస్తామని పేర్కొన్నారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు.

ఇక వాలంటీర్లు మరియు పెన్షన్లకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచామని, ఒకటో తేదీనే ఉద్యోగుల ద్వారా నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. వాలంటీర్లు లేకపోతే ఏమి చేయలేరని అన్నారనీ, వాళ్లు లేకపోయినా పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇక వాలంటీర్లను ఏం చేయాలో, ఎక్కడ వినియోగించాలో అనే దానిపై ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

పత్తికొండ పర్యటనలో భాగంగా పుచ్చకాయల మాడ గ్రామంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపావళి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తామని సిఎం ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాది కి మూడు సిలిండర్ల ను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి అందిస్తున్నామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

You cannot copy content of this page