ఏపీ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త తెలిపింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే . అయితే తాజాగా ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పాలసీ రెండేళ్ల కాలపరిమితితో, అంటే అక్టోబర్ 12 నుంచి సెప్టెంబర్ 30. 2026 వరకు కొత్త మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం షాపులకు లైసెన్సులు జారీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
నేటి నుంచి (అక్టోబర్ 1, 2024) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ కానుంది. రాష్ట్రంలో కొత్తగా మద్యం షాపులను ఏర్పాటు చేయాలనుకున్నవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకునే వెసులుబాటును కూడా కలిగించింది. మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఒక్కో షాపుకు రెండు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది
మద్యం షాపులు దరఖాస్తు కోసం చెల్లించాల్సిన నాన్ రిఫండబుల్ రుసుమును డెబిట్ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాంక్ చలానా ద్వారా చెల్లించవచ్చు. లేదంటే డిడి తీసుకెళ్లి ఎక్సెస్ స్టేషన్లో అందజేయవచ్చు. ఈ దరఖాస్తు ప్రక్రియకు ఈనెల 9వ తేదీ వరకు గడువు కలదు.
అక్టోబర్ 11న మద్యం షాపులకు సంబంధించిన లాటరీ తీసి లైసెన్స్ లోని కేటాయించడం జరుగుతుంది. ఈ నెల 12 నుంచి లైసెన్స్ పొందిన వాళ్లు షాపులను ప్రారంభించుకోవచ్చు. రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చేంతవరకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ షాపులో కొనసాగుతాయని నోటిఫికేషన్లో తెలపడం జరిగింది.
నాలుగు స్లాబుల్లో లైసెన్స్ రుసుములు
రాష్ట్రంలో మద్యం షాపులో ఏర్పాటు చేసే ప్రాంతంలో జనాభాను బట్టి నాలుగు స్లాబులో రుసుములు ఉంటాయని ప్రభుత్వం నోటిఫికేషన్ లో తెలిపింది. ఆ స్లాబుల వివరాలు ఇలా ఉన్నాయి
ప్రాంతం | లైసెన్స్ ఫీజు |
---|---|
10 వేల వరకు జనాభా | రూ.50 లక్షలు |
10 వేల నుంచి 50 వేల వరకు | 55 లక్షలు |
50,001 నుంచి 5 లక్షల వరకు | 65 లక్షలు |
5 లక్షలు దాటిన నగరాల్లో | గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలు |
అలాగే లైసెన్స్ ఫీజులతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్‌ను ఈసారి రెట్టింపు చేశారు. గతంలో 10శాతం ఉంటే ఇప్పుడు 20శాతం మార్జిన్ వ్యాపారులకు వస్తుంది.
12 ప్రీమియం స్టోర్లు
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం నోటిఫై చేసిన 3,396 మద్యం షాపులకు అదనంగా 12 ప్రీమియం స్టోర్లు కూడా ఏర్పాటు చేస్తారు.
- విజయవాడ,
- గుంటూరు,
- విశాఖపట్నం,
- రాజమహేంద్రవరం,
- కాకినాడ,
- నెల్లూరు,
- కర్నూలు,
- కడప
- అనంతపురము
ఈ స్టోర్లకు ఐదేళ్ల కాలపరిమితితో.. లైసెన్సు రుసుము ఏడాదికి రూ.కోటిగా నిర్ణయించారు.
మద్యం షాపులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- 3,396 ప్రైవేట్ లిక్కర్ షాపులకు అక్టోబర్ 1 ఉ.11 గం. నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
- ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా, ఎన్ని అప్లికేషన్లైనా చేసుకోవచ్చు.
- ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల చొప్పున డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు లేదా DD తీసుకుని ఎక్సైజ్ స్టేషన్లలో ఇవ్వాలి.
- ఈ నెల 11న లాటరీ తీసి, లైసెన్సులు ఇస్తారు. ఆ రోజు ప్రభుత్వ మద్యం షాపులు మూతపడి, 12 నుంచి ప్రైవేట్ దుకాణాలు ప్రారంభమవుతాయి.