తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీ ల పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టునుంది.
ఈ మేరకు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు(Indiramma indlu ) సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హులను గుర్తించే విధి విధానాలు మరియు ప్రక్రియ కోసం ఇందిరమ్మ కమిటీలను దసరా నాటికి ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.
గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాలను రెండు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారి చేశారు.
పీఎంఏవై కిందా రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ను కేంద్రానికి అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఏళ్ల తరపు నీరు ఉపయోగంగా ఉన్న రాజీవ్ ఇళ్లను వేలం వేసి లబ్ధిదారులకు కేటాయించాలని ముఖ్యమంత్రి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులను గుర్తించిన నేపథ్యంలో అర్హులైన వారికి ఇళ్లను అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస రావు పాల్గొన్నారు.