ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వారితో పాటు కల సహాయార్థం నటీనటులు మరియు ఇతర ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి తమకు తోచిన విరాళాలను అందించిన విషయం తెలిసిందే.
అయితే విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం విజయవాడలోని 32 డివిజన్లో ప్రాథమిక సర్వే నిర్వహించి నష్టం అంచనాలు నమోదు చేసింది.
వరదల కారణంగా నష్టపోయిన వారికి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిర్దేశించిన దానికంటే ఆర్థిక సాయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
విజయవాడలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు రూ.11వేలకు బదులుగా రూ.25 వేలు ఇవ్వనున్నారు.
మొదటి ఫ్లోర్లో ఉన్నవారికి రూ.10 వేలు, దుకాణాలకు, పంటలకు హెక్టారుకు రూ.25 వేలు అందించనున్నారు. • ఇళ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వం కొత్త ఇంటిని నిర్మించి ఇవ్వనుంది.
ఎన్యుమరేషన్ ప్రక్రియ, పరిహారం చెల్లింపుపై సమీక్షించిన చంద్రబాబు, ఈ నెల 25న వరద బాధితులకు పరిహారం అందజేయనున్నారు.