ఏపీలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు..ఉత్తర్వులు జారీ

ఏపీలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు..ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Nirudyoga Bruthi Rs 3 Thousand: ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో ఇప్పటికే కొన్ని అమలు చేసింది. సూపర్ సిక్స్‌‌తో పాటుగా మరికొన్ని పథకాలను అమలు చేయాల్సి ఉంది.. వీటిలో పలు పథకాలకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా మరో పథకం అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం.. వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రజాగళం 2024 హామీ మేరకు.. వేద విద్య చదివి ఉద్యోగం లేని నిరుద్యోగ యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తారని తెలిపారు. ఈ మేరకు వేద విద్య చదివి ఉద్యోగం రాని యువత వివరాలు సేకరించాలని దేవాదాయశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాలో దేవాదాయశాఖ అధికారులకు ఈ మేరకు మెమో ద్వారా ఆదేశాలు పంపారు.

నిరుద్యోగ భృతి పొందడానికి అందించాల్సిన వివరాలు

దేవాదాయశాఖ జారీ చేసిన మెమోలో నిరుద్యోగి పేరు, చిరునామా.. ఆధార్ నంబర్.. ఏ వేదం చదివారు, క్వాలిఫికేషన్ ఏంటి.. ఏ ఉద్యోగం చేయడం లేదని స్వీయ హామీ పత్రం.. రిమార్క్స్ ‌ను ప్రస్తావించారు. ఈ ఫార్మాట్‌లో నిరుద్యోగ యువత వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించారు. అయితే దేవాదాయశాఖ కమిషనర్ జారీ చేసిన మెమోలో ఈ నెల 16లోపే వివరాలను పంపించాలని ఆదేశించడం విశేషం.. అయితే కమిషనర్ మెమో ఏమో ఈ నెల 17న జారీ చేసినట్లు కనిపించింది. ఈ ఆదేశాలపై దేవాదాయశాఖ అధికారులు స్పందించాల్సి ఉంది. ఈ మెమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిరుద్యోగ భృతి కేవలం వేద విద్యను అభ్యసించిన వారికి అమలు చేయడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. డిగ్రీలు, పీజీలు పూర్తి చేసిన నిరుద్యోగుల భృతి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.

You cannot copy content of this page