ఏపి లో ఇకపై ఆన్లైన్లో ఇసుక బుకింగ్, డోర్ డెలివరీ చార్జీలు ఇవే

ఏపి లో ఇకపై ఆన్లైన్లో ఇసుక బుకింగ్, డోర్ డెలివరీ చార్జీలు ఇవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ పద్ధతిలో ఉచిత ఇసుక బుకింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. సెప్టెంబర్ మూడవ వారంలో ఆన్లైన్ ఇసుక బుకింగ్ ఆప్షన్ను నేరుగా వెబ్సైట్ మరియు సచివాలయాలలో అందుబాటులోకి తీసుకొస్తుంది.

అంతేకాకుండా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి ఇంటి వద్దకి తీసుకొని డోర్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి ఉన్నటువంటి లారీ యజమానులు మరియు లారీ సంస్థల నుంచి గనుల శాఖ దరఖాస్తులను స్వీకరిస్తుంది.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల లారీలకు ఇసుక డోర్ డెలివరీ చేసేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రవాణా చార్జీలను కూడా తక్కువగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఇసుక రీచ్ పాయింట్ నుంచి ఇంటి వద్దకు డెలివరీ చేస్తే రవాణా చార్జీల వివరాలు కింది విధంగా ఉండనున్నాయి.

ఉచిత ఇసుక డోర్ డెలివరీ చార్జీలు ఇవే

ఇసుక డోర్ డెలివరీకి వాహనదారులు వసూలు చేయాల్సిన చార్జీలు ప్రాథమికంగా ఈ విధంగా ఉన్నాయి.

  • రీచ్, స్టాక్ పాయింట్ నుంచి 10కి.మీ. లోపు దూరమైతే.. టన్నుకు, కిలో మీటరుకు ₹12 చొప్పున ధర నిర్ణయించాలని ప్రతిపాదిస్తున్నారు.
  • దూరం పెరిగే కొద్దీ ధర తగ్గుతుంది. గరిష్ఠంగా 40 కి. మీ. కంటే ఎక్కువ దూరం ఉంటే టన్నుకు ప్రతి కిలోమీటర్ కి ఆరు రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.

అయితే ఈ ధరల పై అధికారిక ప్రకటన త్వరలో వెలువలనుంది.

ఆన్లైన్లో ఉచిత ఇసుక బుకింగ్ ఎలా చేసుకోవాలి

నేరుగా ఇసుక బుకింగ్ ను వెబ్సైట్లో చేసుకునే సదుపాయం కల్పించడం జరుగుతుంది. ఇందుకోసం సంబంధిత బుకింగ్ యజమాని యొక్క ఆధార్, మొబైల్ తో పాటుగా డోర్ డెలివరీ అడ్రస్ పొందు పరచాలి. ఇదే సదుపాయాన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా కల్పిస్తున్నారు.

You cannot copy content of this page