Free Groceries Under BPL Card: రేషన్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్నోళ్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఫ్రీగా రేషన్ అందిస్తుంటాయి. లబ్ధిదారుల ఆహార భద్రత కోసం.. ఫ్రీగా రేషన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారత ప్రభుత్వం.. ఈ పథకంలో పెద్ద మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తుంది. గతంలో రేషన్ కార్డు హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం.. ఉచితంగా బియ్యం ఇచ్చింది. అయితే ఇప్పుడు బియ్యానికి బదులుగా.. 9 నిత్యవసర వస్తువుల్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. భారత ప్రభుత్వ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద.. ఇప్పుడు దేశంలోని 90 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ ఇస్తున్నారు. లబ్ధిదారులకు అంతకుముందు బియ్యం ఫ్రీగా ఇచ్చేవారు.
ఇప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు.. బియ్యానికి బదులుగా ఉచితంగా 9 నిత్యావసర సరకుల్ని ఇవ్వాలని కేంద్రం యోచిస్తున్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ఆవ పండి, ఉప్పు, చక్కెర, ఇతర ధాన్యాలు, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు వంటివి ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇక్కడ ఉచిత బియ్యం ఇస్తారా లేదా అనేదానిపై స్పష్టత రావట్లేదు. కొన్ని రిపోర్ట్స్… ఉచిత బియ్యానికి బదులుగా ఈ 9 సరకులు ఇస్తారని చెబుతుంటే.. మరికొన్నేమో.. ఉచిత బియ్యంతో పాటుగా ఇస్తారని పేర్కొంటున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు.. వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడతాయని భావిస్తుందంట.
మీరు రేషన్ కార్డుకు అర్హులై ఉండి.. ఇప్పటివరకు కార్డు రాకుంటే.. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దగ్గర్లోని ఆహార, పౌర సరఫరా శాఖ ఆఫీసుకు వెళ్లి లేదా.. ఫుడ్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫారంలో అడిగిన మొత్తం వివరాల్ని ఎంటర్ చేసి.. సంబంధిత డాక్యుమెంట్స్ యాడ్ చేసి.. రేషన్ ఆఫీసులో సమర్పించాలి. తర్వాత అధికారి మీ వివరాల్ని పరిశీలిస్తారు. వెరిఫికేషన్ అయిపోతే.. రేషన్ కార్డు జారీ చేస్తారు.
అయితే.. తెలంగాణలో మాత్రం కొత్త రేషన్ కార్డు జారీ నియమ, నిబంధనలు ఇంకా రూపొందించలేదు. గతంలో ముందుకొచ్చినా.. మళ్లీ ఇది ముందుకు సాగలేదు. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. మార్పులు, చేర్పులకు కూడా అవకాశం ఉంటుందని తెలుస్తోంది.